రాఖీ

సోదరి కట్టే రక్షా బంధన్
అన్నదమ్ముల సోదర ప్రేమకు
అక్క – చెల్లెళ్లు పలికే
సాదర స్వాగతానికి ప్రతీక.
ఈ రాఖీ ఓ మంగళ ‘కర’సూత్రం
ఆడపడుచుల రక్షణ
అన్నదమ్ముల బాధ్యత
రాఖీ సోదరీ సోదరుల ఆప్యాయతల కలబోత
ఇదే మన భారతీయత
అక్కచెల్లెళ్లు అన్నదమ్ముల అనుబంధం
మేలి మానవ సంబంధాల సుగంధం
అన్న – నాన్నకు ప్రతిరూపం
అక్క – అమ్మకు పర్యాయం
తోబుట్టువులు కడుపున పుట్టిన వారితో సమం
ఈ బంధాలను చాటే
రాఖీ సదాచారాల సామాజిక సుమం
సోదరీ రాఖీ కట్టడం… మన సంస్కృతిలో ఓ “కట్టు” బాటు
అందుకనే రాఖీ అవుతుంది
అక్క చెల్లెళ్ల రక్షణకు చెల్లుబాటు

-బి.ఎం.పి. సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap