యూట్యూబ్లో 100 ఎపిసోడ్‌(చిత్రా)లతో రికార్డ్

13 గంట 26 నిమిషాల్లో షూట్‌చేసిన 100 ఎపిసోడ్‌(చిత్రా)లు

స్థానిక కేంద్రీయ విద్యాయంలో ఆర్టు టీచరుగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణ 11 సంవత్సరాల క్రితం బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్ళతో ఆయిల్‌ కలర్స్‌ని ఫింగర్‌ పెయింటింగ్స్‌గా వాడి 12 x 16 ఇంచెస్‌ స్ట్రెచ్డ్‌ క్యాన్‌వాసుపై 13:26 గంట(806 నిమిషా)ల్లో ‘100 చిత్రాలను వేసారు. ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలిచిన ప్రముఖ చిత్రకారులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధుల మధ్య చిత్రించిన ఆ వంద చిత్రాలను చిత్రించటం జరిగింది. నాటి ఆ సాహశాన్ని మెచ్చి ప్రపపంచ రికార్డు సంస్థలు రామకృష్ణకు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రశంసించాయి.

కరోనా కష్టకాలం నేర్పిన పాఠాలతో యూట్యూబర్‌గా మారిన రామకృష్ణ ఓ చిత్రకారునిగా గతంలో తాను చిత్రించిన వందల చిత్రాలను వీడియోలుగా మలచి యూట్యూబు వేదికపై 14 వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలిచ్చారు.

ఈ అనుభవంతో ప్రపంచ రికార్డు కొరకు 2010లో 100 చిత్రాలను 13.26 గంటల్లో చిత్రిస్తున్నప్పుడు తీసిన  13.26 గంటల నిడివిగల వీడియో ఫూటేజీ ఆధారంగా మరో సాహసానికి పూనుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన మొదటి ఎపిసోడ్‌తో ప్రారంభించి రోజుకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. 100వ ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 10వ తేదీన ముగియనుంది. ఇది ఖచ్చితంగా నూతన ప్రపంచ రికార్డు. ప్రతి రోజు ఉదయాన్నే 5.30 గం॥కు (భారత కాలమానం ప్రకారం) ప్రపంచాన్ని పలకరిస్తూ యూట్యూబ్‌ ప్రపంచ వేదికపై 100 రోజులు  కను విందు చేస్తు, కళాప్రియుల్ని అలరిస్తుంది.

ఓ ఫర్‌ఫార్మర్‌గా, ఓ ఎడిటర్‌గా, ఓ గ్రాఫిక్‌ డిజైనర్‌గా, ఓ ప్రొడ్యూసర్‌గా, ఓ డైరెక్టర్‌గా… అన్నీ తానై ఈ వీడియోను రూపొందించటం మరో విశేషం. ప్రతిరోజు ఒకే టైమ్‌కి ‘‘ఆత్మకూరు రామకృష్ణ ఆర్టిస్ట్‌’’అన్న స్వీయ యూట్యూబ్‌ ఛానల్లో ధారావాహికగా ప్రసారం అయ్యేట్లు ఏర్పాటు చేయటం గొప్ప క్రమశిక్షణ.
ప్రపంచ రికార్డు సాధించిన ఫింగర్‌ పెయింటర్‌ గా ఆత్మకూరు రామకృష్ణ నేడు యూట్యూబర్‌గా మారి చూపిన విన్యాసమిది. ఫలించిన కృషి ప్రపంచ రికార్డుగా రికార్డు చేయబడిన 13 గంటల 26నిమిషాల వ్యవథిని క్షణం కూడా వదలక ప్రేక్షకులకు అందించిన 100 (3 నెలా 10)రోజుల యజ్ఞం ఇది.

100 ఎపిసోడ్‌లను ఎడిట్‌చేసి యూట్యూబ్‌లో షేడ్యూలు ప్రకారం అప్‌లోడ్‌ చేసిన తరువాతే ప్రపంచ రికార్డుగా అటెమ్టు చేయగల సత్తావున్న ప్రక్రియగా భావించటం జరిగిందని, మరొకరికి అంత సులభ సాధ్యం కాని విషయం కనుకనే ఈ రికార్డును ప్రపంచ రికార్డుగా క్లైమ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం అటుంచితే…11 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలో జరిగిన ఆ పూర్తి కార్యక్రమాన్ని 100 భాగాలుగా చక్కగా వీక్షించదలచిన వారికి వినోదాన్ని కలిగించేలా చక్కని సంగీతాన్ని జోడిరచి ఆహ్లాదాన్ని పంచారు.

ఈ వంద లఘచిత్రాలను రూపొందించడానికి ఆనాడు తైలవర్ణ చిత్రాలను వేయడానికి 13.26 గంటలు ఎలా శ్రమించానో అంతకు మించి ఎన్నో రెట్లు శ్రమ నేడు తీసుకున్నాను అంటారు.

ప్రతి వీడియో థంభ్‌ నైల్‌లో ఎన్నో పెయింటింగ్‌ వీక్షిసున్నది, ఆ చిత్రం ఏ క్షణంలో మొదుపెట్టి ఏ క్షణంలో ముగించటం జరిగింది వీక్షకులు తెలుసుకునేలా విజువలైజ్‌ చేయటం జరిగింది.
100 చిత్రాలను చిత్రిస్తున్నప్పుడు ఏవరుసలో అయితే చిత్రించటం జరిగిందో అదే వరుసలో ఎపిసోడ్‌ను రిలీజు చేయటం జరిగింది.
విజువల్‌ ఆర్టు(దృశ్య కళ)ల్లో ఒకటైన చిత్రలేఖనాన్ని నాలుగు గోడల మధ్య కాక ఫర్‌ఫామింగ్‌ ఆర్టు(ప్రదర్శన కళ)గా మార్చి పేక్షకులముందు ప్రదర్శించటమేకాక, దానికి కొన సాగింపుగా మీడియా, కమ్మునికేషన్‌ రంగాల అంతర్భాగమైన ఇంటర్‌ నెట్‌, సోషల్‌ మీడియాను అందిపుచ్చు కోవటం వలన  ఫింగర్‌ పెయింటింగును మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటం జరిగింది.

కళకు, కళారూపాకు ఖర్చు లేని ప్రచార వేదిక యూట్యూబ్‌ కాగా, ఆ వేదికతో పంచుకున్న వరల్డ్‌ రికార్డు ఫీట్‌కు శాస్వతత్వం లభించింది. భవిష్యత్‌ తరాలకు ఈ వరల్డ్‌ రికార్డు విశేషాలను ఓపన్‌గా ఉంచటం, మరికొందరికి ఇన్సిపిరేషన్‌ ఇవ్వటంమేకాక; యూట్యూబ్‌ ద్వారా ఓ గొప్ప సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించిన వాళ్ళమవుతాము.

చిత్రకళా రంగంలోను, యూట్యూబ్‌ చరిత్రలోను యునీక్‌ అచీవ్‌ మెంట్‌గా నిలిచే ఈ ఫీట్‌లో అంతర్లీనంగా దాగిన  ఆలోచన ‘పర్యావరణం – పచ్చదనం’!!. ఇలా ప్రపంచ కళారంగంలో రామకృష్ణ పేరు మరోమారు వినిపించనున్నది.
క్రింది లింక్ ద్వారా యూట్యూబ్‌లో వీడియోలను చూడవచ్చు…
https://www.youtube.com/watch?v=f3BsdeYLbwI
-కళాసాగర్

2 thoughts on “యూట్యూబ్లో 100 ఎపిసోడ్‌(చిత్రా)లతో రికార్డ్

  1. కళలకు, కళాకారులకు మీరు ఇస్తున్న ప్రోత్సాహం అమోఘం. మరో మారు ధన్యవాదాలు సార్.

  2. కరోనా కష్టకాలంలోనూ అడిగిందే తడవుగా మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక ఈ వ్యాసాన్ని ప్రచురించిన మీ కళాభిమానానికి , ఎడిటరుగా మీ నిబద్ధతకు పొగడ మాటలు లేవు. మీ ద్వారా ఆ వంద చిత్రాలను చూడాలనుకున్న కళాభిమానులు ఈ లింక్ ద్యారా చూడగలరని భావిస్తున్నాను. Finger Painting – Marathon 100 Episode (No. 1 to 100) Play List Link:
    (All 100 available in one link) https://www.youtube.com/playlist?list=PLhTn682UF5_kYj0tGfVxOCJ6CjzGGiAWj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap