కవి ప్రతిభా పురస్కారాలు-2020

రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన ఆరేళ్ళ నుండి ఏటా జన రంజక కవిత్వ గ్రంథాలకిస్తున్న పురస్కారాలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే పురస్కారాల ప్రదానం చేసేవారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులైలో ప్రకటించారు. 2016 నుండి 2020 వరకు ప్రచురించిన కవిత్వ గ్రంథాలను పోటీకి ఆహ్వానించారు. ఇందులో పది కవిత్వ గ్రంథాలకు పురస్కారాలు ప్రకటించారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా గుంటూరులో సభలో అందించే అవకాశం లేనందువల్ల కవులకు ఒక్కొక్కరికి రూ.2000/- చొప్పున నగదు వారి బ్యాంకు అకౌంటుకు పంపించనున్నారు. ప్రశంసా పత్రం మెయిల్ ద్వారా లేక వాట్సప్ నంబరుకు పంపిస్తామని డా. రావి రంగారావు సాహిత్య పీఠం కన్వీనరు-నర్రా ప్రభావతి తెలియజేశారు.
అవార్డ్ పొందిన పుస్తకాల పేర్లు, కవుల పేర్లు.

 1. నది అంచున నడుస్తూ… డా. సి. భవానీదేవి
 2. కొత్త వేకువ … పద్మావతి రాంభక్త
 3. ఈ గాయాలకు ఏం పేరు పెడదాం … డా. బీరం సుందరరావు
 4. నీటి దీపం … తండ హరీష్ గౌడ్
 5. తెలంగాణ రుబాయిలు … ఏనుగు నరసింహారెడ్డి
 6. చౌరస్తాలో సముద్రం … సంగెవేని రవీంద్ర
 7. మట్టి పొరల్లోంచి … సోమేపల్లి వెంకట సుబ్బయ్య
 8. గాజు రెక్కల తూనీగ … సాంబమూర్తి లండ
 9. స్పెల్లింగ్ మిస్టేక్ … అనిల్ డ్యానీ
 10. అద్వంద్వం … శ్రీరాం
  విజేతలందరికీ 64కళలు పత్రిక అభినందనలు తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap