సేవా కేరాఫ్ రోటరీ… గవర్నర్ సతీష్ బాబు

రోటరీ 3020 గవర్నర్ గా ప్రశంసలు అందుకున్న ముత్తవరపు సతీష్ బాబు.

ఒక చిన్నారి గుండె పదిలంగా పనిచేస్తోంది. సరస్వతి నిలయాల్లో విద్యార్థులకు తాగునీరు వచ్చింది. ఒక “కుట్టు మిషన్” మహిళలకు స్వయం ఉపాధిని ఇచ్చింది. వీటన్నింటి వెనుక ఉన్న హస్తం ‘రోటరీ ఇంటర్నేషనల్. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆరు జిల్లాలు రోటరీ 3020 డిస్ట్రిక్ట్ గా వ్యవహారిస్తారు.దీనికి గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ముత్తవరపు సతీష్ బాబు గతంలో లేనంత విధంగా సేవాకార్యక్రమాలు నిర్వహించి 3020 డిస్ట్రిక్ట్ స్థాయిని పెంచారు. 3020 డిస్ట్రిక్ట్ పరిధిలో మొత్తం 73 క్లబ్ లు ఉన్నాయి. వాటిని సతీష్ 77 పెంచారు. ఆయన ఈ ఏడాది పదవీ కాలంలో అనేక సేవాకార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు వసూలు కోసం ఎంతో శ్రమించారు.

సప్త సేవలు—-
రోటరీ సంస్థ లో “సేవ’ ప్రధాన వేదికగా సప్త సూత్రాలు ఉంటాయి. ఆయా అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విరాళాలను అందజేయడం, సేవా కార్యక్రమాలను నిర్వహించడం చేస్తుంటారు. పారిశుద్ధ్యం, ప్రాథమిక విద్య, తాగునీరు, పర్యావరణ సంరక్షణ, సమాజంలో శాంతి నెలకొల్పడం, ఆరోగ్య సంరక్షణ, తల్లిబిడ్డల సంక్షేమం ప్రధానాంశాలు. ఈ ఏడాది వార్షిక నిధి, పోలియో నిధి, భవిష్య నిధులు సేకరించడంలో డిస్ట్రిక్ట్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ముత్తవరపు సతీష్ బాబు చేసిన కృషి గత మూడేళ్ల నిధుల మొత్తానికి సమానంగా రూ. 4.30 కోట్లు ఈ ఏడాది రోటరీ ఇంటర్నేషనల్‌కు అందించి ప్రశంసలు అందుకున్నారు. దీనిలో భాగంగా తనవంతుగా భవిష్య నిధికి తన తల్లీదండ్రుల పేరున సతీష్ బాబు రూ. 18.75 లక్షలు విరాళంగా ఇచ్చారు.
3020 డిస్ట్రిక్ట్ లో సేవా కార్యక్రమాలకు కోసం రూ. ఈ ఏడాది 10 కోట్లను రోటరీ గ్రాంట్ ఇవ్వగా, రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో ఆరు జిల్లాలో 77 క్లబ్ ల ఆధ్వర్యం లో సేవలు అందించారు.

తోటపల్లి హీల్ ప్యారడైజ్ లో ఉన్న 1000 మంది అనాథ పిల్లల ఆశ్రయానికి రూ.1.10కోట్ల వ్యయంతో తాగునీటి కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను ఏర్పాటు చేశారు.

Blood Bank

*నున్నలో జిల్లా పరిషత్ పాఠశాలలో రూ. 30 లక్షలతో 47 మరుగుదొడ్ల నిర్మాణం.
*తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గౌతమీ నేత్ర వైద్యాలయంలో శస్త్రచికిత్స చేయడానికి రూ. 1.60 కోట్లతో ప్లారస్ 700 సిస్టమ్ ఏర్పాటు.

*ఉయ్యూరు కంటి ఆస్పత్రిలో రెటీనా వ్యాధుల నిర్ధారణకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ను రూ. 30 లక్షలు వెచ్చించారు.
• ఆంధ్రా ఆస్పత్రిలో చిన్నారుల గుండె వ్యాధుల శస్త్రచికిత్సలకు రూ. 70 లక్షలు ఇచ్చారు.
• విశాఖ జిల్లా అనకాపల్లిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత కంటి వైద్యశాలను రూ. 25 లక్షలతో అభివృద్ధి చేశారు.

• మహిళలకు స్వయం ఉపాధి కోసం కృష్ణా, విశాఖ జిల్లాల్లో రూ. 45 లక్షలతో 200 మందికి ఆధునిక టెక్నాలిజీతో కూడిన సూయింగ్ మిషన్లు ఇచ్చారు.
• విశాఖపట్నంలో ఉన్న ఆశ్రయ అనాథ ఆశ్రమంలో రూ. 25 లక్షలతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
• విజయనగరంలో ఉన్న పాఠశాలల్లో రూ. 25 లక్షలతో తాగునీటి సదుపాయం కల్పించారు.
రూ. 12 లక్షలతో 200 మంది వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు.

  • ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకారవేతనాలుగా రూ. 45 లక్షలు పంపిణీ చేశారు.
    • అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరులో కోవిడ్ రోగులకు రూ. 8లక్షలతో ఆహారాన్ని పంపిణీ చేశారు.
    • కోవిడ్ సమయంలో రూ. 20 లక్షలతో పేదలకు రూ. 300 నిత్యావసరాలను 6 వేల మందికి పంపిణీ చేశారు.
    వీటితో పాటు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

ప్రత్యేకంగా కోవిడ్ కేర్ టీం…

రోటరీ మిజయవాడ మిడ్ టౌన్ ఇది 3020 డిస్ట్రిక్ట్ లో ఒక క్లబ్. ఈక్లబ్ నుంచే సతీష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా 790 మంది సభ్యులు ఉన్న అతిపెద్ద రోటరీ క్లబ్. 45 మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. రెండో దశలో కోవిద్ తీవ్రత సమయంలో దీన్ని కోవిడ్ కేర్ టీంగా మార్చి 500 మంది కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించారు. విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ జాజు పర్యవేక్షణలో ఈ టీమ్ వైద్య సేవలు అందించడం తో పాటు పలు వైద్య సహాయ సహకారాలు అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap