పరిమళించిన ఎస్.జానకి పాటల పూదోట

సురేఖా మూర్తి కి ఎస్.జానకి వాయిస్ అఫ్ ఇండియన్ ప్రైడ్ పురస్కారం

సమాజ సేవకులను గాయకులను ఒకే వేదిక పై సన్మానించడం గొప్ప స్ఫూర్తి సంప్రదాయమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు అన్నారు. లివింగ్ లెజెండ్ సింగర్ ఎస్.జానకిగారి స్వరంలో నవరసాలు అద్భుతంగా పలుకుతామని కితాబునిచ్చారు. శనివారం హైదరాబాద్ర, వీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెండి వెలుగులు శీర్షికతో గాయని ఎస్.జానకిగారి పాటల స్వరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని శ్రీమతి సురేఖామూర్తిగారిని ఎస్.జానకి వాయిస్ ఆఫ్ ఇండియన్ ప్రైడ్ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రముఖ సామాజికవేత్త, బహుజనుల బంధువు, నిరుపేద విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి, ఉచిత శిక్షణ ఇప్పిస్తూ ఐఎఎస్ అధికారులుగా తీర్చిదిద్దుతున్న విద్యావేత్త ఐఆర్టిఎస్ విశ్రాంత రైల్వేస్ అధికారి ఎ. భరత్ భూషణ్ గారిని మహా సేవా చక్రవర్తి బిరుదుతో సన్మానించారు. యువ గాయకులు సుజాతను జానకి గ్లోరియస్ అవార్డుతో, విశాఖకు చెందిన ఇందునయనను జానకి ఎక్స్ లెన్స్ పురస్కారంతో సత్కరించి అభినందించారు.

Venditera Velugulu inauguration

సీల్వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావుగారు, వికారాబాద్ కు చెందిన సద్గురు సాయిరాం హాస్పిటల్ అధినేత కె.సత్యనారాయణ గౌడ్ ఆశీస్సులతో ఈ వేడుక జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, డాక్టర్ మహ్మద్ రఫీ, కల్చరల్ టివి.ఎన్.పురుషోత్తం గౌడ్, సినీ సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్, కె.బందయ్య గౌడ్, ఇన్ కం టాక్స్ ఉన్నతాధికారి ఎల్.మోహన్, గాయకుడు చంద్రతేజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పి.ఎం.కె.గాంధి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రవీణ్ కుమార్, శ్రీమతి పారిజాత సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఆరు గంటల పాటు కొనసాగిన సినీ సంగీత విభావరిలో జానకి పాడిన పాటలను ప్రవీణ్ నేతృత్వంలో శ్రీమతి సురేఖామూర్తి, సుజాత, ఇందు నయన, రాధ, పసుల లక్ష్మణ్, జనాబ్ ఎస్.ఖాదర్, సింహ ఆలపించి ఆద్యంతం అలరించారు.

ఫోటోలు: కంచె శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link