తరతరాల నిర్బంధాల సంకెళ్లను తెంచుకొని ఆకాశమే హద్దుగా విజయాలు సాధిస్తున్న మహిళల సత్తాను చాటే అద్భుత చిత్రకళా ప్రదర్శన నగరంలో అందరినీ ఆకట్టుకున్నది. ‘సబల-సృజన’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గోనె రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని ఎం. ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 5 తేదీ, మంగళవారం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 26 మంది మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శనకు నారీ సేన వ్యవస్థాపకురాలు లతాచౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకారిణులను అభినందించారు.
ఈ చిత్రకళా ప్రదర్శనలో ప్రసూన మురళి చిత్రానికి మొదటి బహుమతి, సరితా అర్రా, ప్రసన్న జ్యోతి రెండు, మూడు బహుమతులు, ప్రత్యేక బహుమతి కాసుల పద్మావతి అందుకున్నారు. సుకాంతి, హర్షిత, సూర్య కుమారి ప్రత్యేక బహుమతులందుకున్నారు.
గోనె వెంకటేశ్వర్ సేవా సంస్థ తరపున గోనె రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Thank you very much everyone for your kind words it means a lot ❤️ sir feeling proud sir