కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం

శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు చేసిన విభిన్న రకాలుగా నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ నిర్వాహకురాలు డాక్టర్ పి. రమాదేవిగారు కళారంగంలో సేవ చేసే వారిని గుర్తించి, వారికి ప్రతీ సంవత్సరం వారి సంస్థ తరఫున విశిష్ట కళాసేవా పురస్కారాలను అందజేస్తారు. ఈ సంవత్సరం కళకు సేవ చేసేవారిని 5 గురిని ఎంపిక చేశారు. వారిలో కూచిపూడి నృత్యకారిణి అనుపమ మోహన్, సంగీత కళాకారిణి లావణ్య లత, మృదంగం విధ్వాంసులు ప్రభాకరరావు, సురభి కళాకారుడు మాధవ (మేకప్), యువ కళావాహిని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి గారు, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణగారు, నాట్య గురువులు నిర్వాహకురాలైన డాక్టర్ పి. రమాదేవి గారి చేతుల మీదుగా గ్రహీతలను సన్మానించి వారికి విశిష్ట కళాసేవ పురస్కారాన్ని అందజేశారు.

మల్లిఖార్జునాచారి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap