
నేటి తరం చిన్నారులకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని ఔన్నత్యాన్ని తెలియపరచి, పిల్లల్లో దేశభక్తిని పెంపొందించి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా విజయవాడ “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ, కాకరపర్తి భావన్నారాయణ కాలేజీలో నిర్వహిస్తున్న సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢీల్లీరావుగారు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెలగా జోషి, కాకరపర్తి భావన్నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డెరైక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=tBacEqgsb88

