కన్నుల పండుగగా సలాం ఇండియా

అలరించిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్

విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో 5వ తేదీ,ఆదివారం కేబీఎన్ కాలేజీ ఆవరణలో జరిగిన సలాం ఇండియా ఆర్ట్ ఈవెంట్ కన్నుల పండుగగా జరిగింది.. ఆర్ట్ కాంటెస్ట్ లో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం చిన్నారుల చిత్రకళా ప్రదర్శనను ప్రముఖ ఛాయాగ్రాహకుడు తమ్మా శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం జరిగిన బహుమతీ ప్రధానోత్సవానికి జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందచేశారు. బహుమతీ ప్రధానోత్సవానికి ముందుగా దేశ భక్తి గీతాలకు చిన్నారుల చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం చిత్రకళలో విశిష్ట సేవ చేసిన చిత్రకారులు ఉదయ్ కుమార్, శేషబ్రహ్మం, కొలుసు సుబ్రహ్మణ్యంలను ఘనంగా సత్కరించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న బడ్డింగ్ ఆర్టిస్టులకు… క్రియేటివ్ టీమ్ సభ్యులందరిని ఘనంగా సత్కరించారు..ఈ కార్యక్రమానికి కేబీఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణరావు గారు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్ గవర్నర్ శ్రీమతి మితింటి శారదలు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు… కార్యక్రమాన్ని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ స్నేహా శ్రీనివాస్ పర్యవేక్షించారు.

Art exhibition inauguration by Srinivasa Reddy
SA: