
సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పలు జిల్లాలలో జరుగుతున్న వివిధ లలిత కళల వేసవి శిక్షణ శిబిరం లో భాగంగా సంస్కార భారతి విజయవాడ మహానగర్ శాఖలో ఏర్పాటు చేసిన పది రోజుల ఉచిత చిత్రకళా శిబిరం స్థానిక గోకరాజు రంగరాజు సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అయోధ్య నగర్లో విద్యార్థులకు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొని శ్రద్ధతో తమ నైపుణ్యతను పెంపొందించుకుని చిత్రరచనలో మమేకమయ్యారు. పెన్సిల్ షేడింగ్లో మరియు రంగులు వేయడంలో మెలకువలు, పండ్లు, పక్షులు, పుష్పాలు మానవ శరీర ఆకృతి, వస్తువులు చిత్రించడంలో తమ వంతు ప్రయత్నం చేసి తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు.
విద్యార్థులు నేర్చుకుంటున్న ఈ ప్రక్రియలు తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని వీటితో వారికి మెరుగైన జామతీయ మరియు త్రీడీ చిత్రీకరణ ఎంతో చక్కగా అర్థమవుతుందని చెబుతున్నారు. చిత్రలేఖనం నేర్చుకుంటే మున్ముందు విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, వాస్తుశాస్త్రం, వంటి కోర్సులలో ఎంతో చక్కగా రాణిస్తారు. ఈ ఆధునిక డిజిటల్ యుగంలో పిల్లలు చతుర్భుజం, వృత్తాకారం, ఇతరేతర రేఖలు వంటివి కూడా గీయటం మర్చిపోతున్నారు. చిన్న వస్తు నిర్మాణంపై అవగాహన లేకపోతే రేపటి ఇంజనీర్లు ఎలా కాగలరు. ప్రతి విద్యార్థి ఎంతోకొంత జామతీయ కళ నేర్చుకుంటే తమ భవిష్యత్తు ఎంతో సుఖంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల, చదువులు, ఆటపాటలతో పాటు లలిత కళలు పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ చిత్రకళ వేసవి చిత్రకళ శిబిరం ముగింపు సభలో చిత్రకళా గురువు వెంకట శివ కుమార్ కు సత్కారం చేశారు ఆపై పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సభలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రకాష్ బాబు, సంస్కార భారతి ముఖ్య సభ్యులైన, పి.వి.ఎన్. కృష్ణ, దుర్బా శ్రీనివాస్, భాస్కర్ శర్మ, అల్లు రాంబాబు, మరియు సాయి శంకర్, పాల్గొని ఈ శిబిరంలో జరిగిన సృజనాత్మక ప్రక్రియలను, విద్యార్థులు తీర్చిదిద్దిన చిత్రాలను చూసి వారి ప్రతిభను కొనియాడారు.
సంస్కార భారతి విజయవాడ మహా నగర్ శాఖ ఏర్పాటు చేసిన 10 రోజుల వేసవి ఉచిత సంగీత శిబిరం స్థానిక గోకరాజు రంగరాజు పాఠశాలలో ఈరోజు (28-5-2025) ముగిసినది. సంగీత విద్యార్థులకు, కీర్తనలు, పద్యాలు, పాటలు, భగవద్గీత శ్లోకాలు మొదలైనవి ప్రతిరోజు నేర్పించడం జరిగినది. సంగీతంతో విద్యార్థులకు జ్ఞానం, విషయంపై ఆసక్తి, గ్రహణ శక్తి, మంచి మనసు కలిగి ఉండటం జరుగుతుంది. గాత్రంతో వాక్ స్పష్టత, భాష లో ఉచ్చరణ లోపాలు జరగకుండా ఉండటం, మానసిక ఆరోగ్యం వంటి గొప్ప ఉపయోగాలు ఉండటం జరుగుతుంది. సంగీత గురువు కె. నాగలక్ష్మీ గారు విద్యార్థులకు నిరంతరం ఈ పది రోజులు మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. చివరి రోజు విద్యార్థులచే గాత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు, ముఖ్య అతిథులు విద్యార్థుల యొక్క ప్రదర్శనను చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సంగీత గురువు శ్రీమతి నాగలక్ష్మి గారికి సత్కారం చేశారు. శిక్షణ పొందిన విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను బహుకరించారు.
–శివ కుమార్
ఎడిటర్ గారికి నమస్కారాలతో
కలలకు సంబంధించిన ఈ ఆర్టికల్ ను 64 కళలు డాట్ కాం లో ప్రచురించినందుకు చాలా సంతోషంగా ఉంది.. పెద్దలైన చిన్న పిల్లలైనా, ఏదైనా కళలను ప్రోత్సహించడంలో మీరు ఎప్పుడూ ముందుండటం మాకెంతో తో ఆనందదాయకం.
ధన్యవాదాలు.💐🙏
64 కళలు డాట్ కామ్ వారు ప్రచురించిన కళలకు సంబంధించిన ఆర్టికల్స్ అన్ని చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి సంస్కార భారతి నిర్వహించిన పోటీల గురించి ప్రచురించి పిల్లలలో స్ఫూర్తిని నింపినందుకు ధన్యవాదాలు
Welcome sir