ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది,
జాగ్రత్తగా ఉండండి !
ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుంది
ముస్లింలు, మైనార్టీలు, దళితులపై
బాహాటంగానే దాడి చేస్తుంది.
ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదు
వదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్ !
గడ్డ కట్టే చలిలో అక్కడ రైతులకు రక్తపరీక్షలు చేస్తుంది
బ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలు
లాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది.
కాపలాదారు వైరస్ రూపంలో వచ్చి
చేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వడు
వైరస్ ‘చాయ్ వాలా’గా వచ్చేసి,
మన చాయ్ మనల్ని తాగనివ్వదు.
ఈ వైరస్ ఇంటికి ఎలా వస్తుందో మనకే తెలియట్లేదు.
గ్యాస్ బండతో వస్తుందా?
బండిలో పెట్రోలుతో వస్తుందా?
కూరగాయలతో వస్తుందా?
సరుకులతో వస్తుందా?
జనాలతో కలిసి మెలసి ఉండొద్దని చెపుతోంది వైరస్
కులాల పేరుతో, మతాల పేరుతో వేరు చేస్తుంది వైరస్
మనుషులంతా ఒక్కటే అన్నవాణ్ణి.
–డా. దేవరాజు మహారాజు
Well said sir