నేషనల్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతగా వైజాగ్ ఆర్టిస్ట్

సంకట్ మోచన్ (Sankatmochan) పోటీలో జ్యూరీ సభ్యులు ఉత్తమ పార్టిసిపెంట్‌గా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నుండి MFA గ్రాడ్యుయేట్ శ్రీనివాసరావు కనుమూరి ఎంపికచేశారు. శ్రీనివాసరావు పోటీలో మొదటి బహుమతిని కైవసం చేసుకోవడానికి 10 పాయింట్లకు తొమ్మిది పాయింట్లు సాధించాడు.

శ్రీరామనవమిని పురస్కరించుకుని దుబాయ్ కి చెందిన ఆర్ట్స్ and క్రాఫ్ట్స్ వారు ఆన్లైన్ తరహాలో లార్డ్ హనుమాన్ కి సంభందించి “సంకటమోచన్“అనే ప్రత్యేక మైన అంశముపై అంతర్జాతీయ స్థాయిలో చిత్రకళా పోటీలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీనివాసరావు ఈ పోటీలలో పాల్గొన్నారు. పాల్గొనేవారు హనుమాన్ చాలీసా లేదా రామాయణంలోని ఏదైనా చౌపాయ్ ఆధారంగా హనుమంతునిపై పెయింటింగ్ గీయాలి. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వారే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొంటున్నారు మరియు ఫిలిప్పీన్స్, USA, క్యూబా, నేపాల్, పాకిస్తాన్, థాయిలాండ్ మరియు అనేక దేశాల నుండి కళాకారులు పాల్గొంటున్నారు. అన్ని వయసుల కళాకారులు తమ కళాకృతులను మార్చి 15 నాటికి సమర్పించారు. మార్చి 30న, విజేతను ఎంపిక చేయడానికి ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. శ్రీనివాసరావు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. అవార్డ్ కి గాను మెమోంటో, సర్టిఫికెట్, మెడల్ ను త్వరలో అందచేయటం జరుగుతుంది.

Certificate

జ్యూరీలో సభ్యులుగా పద్మశ్రీ విజయ్ శర్మ, ప్రముఖ కళాకారులు నవల్ కిషోర్, ధరెంద్ర రాథోడ్, విజయ్ ధోర్, సుకాంత దాస్, కళాకారిణి మరియు కవయిత్రి రేఖా గుప్తా మరియు అశ్వనీ కుమార్ పాల్గొన్నారు.


శ్రీనివాసరావు కనుమూరి ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సమగ్ర శిక్ష ద్వారా Gvmc RBMUP స్కూల్, దాబాగార్డెన్స్, విశాఖ అర్బన్ నందు ఒప్పంద చిత్రకళ ఉపాధ్యుడిగా పనిచేస్తున్నారు. వీరు గతంలో చాలా జాతీయ, అంతర్జాతీయ వేదికలో అనేక ప్రాంతాలలో చిత్రకళా ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా, పలు అవార్డులు అందుకున్నారు.

-కళాసాగర్

4 thoughts on “నేషనల్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతగా వైజాగ్ ఆర్టిస్ట్

 1. The work depicting ” Hanuman ” as the main character of the painting is really worth award winning. It is done in beautifully traditional style representing several interesting episodes of Ramayana. Rarely we find the younger generations working in this style. Congratulations to Srinivas Rao for this beautiful work and for winning the top award. Thanks to Sri Kalasgar for giving nice coverage through 6 kalalu.com.

  1. We feel very proud that we have been working with you Srinivas garu. Great job. Congratulations.
   All the best for your future projects also
   With Love
   Akka

   1. Thank You Akka.ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి…

  2. Thank You Very Much…Sri.Dr.BA Reddy Sir,For Wonderful Comments about Sankatamochan painting..And thank you your valuable Wishes…
   –Srinivasa Rao Kanumuri..Artist, Visakhapatnam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap