
విజయవాడ చిత్రకారుడు “స్ఫూర్తి” శ్రీనివాస్ కి 2025 ‘జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారం’ మరియు చిత్రకళారత్న బిరుదుతో పాటు స్వర్ణ కంకణం బహూకరణ.
విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ ‘పిచ్చుకను చేసుకుందామా మచ్చిక’ అనే నినాదంతో జాతీయ స్థాయిలో చేసిన సేవ్ స్పారో ఉద్యమానికి, కళనీ, కళా సంస్కృతిని పెంపొందించే క్రమంలో గత 20 సంవత్సరాలుగా చేసిన సేవలకి,100 పైగా నిర్వహించిన ఆర్ట్ ఈవెంట్స్ కీ గత 30 సంవత్సరాలుగా చిత్రకళోపాధ్యాయుడిగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా “స్ఫూర్తి” శ్రీనివాస్ కి తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ కి చెందిన “శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక మరియు శ్రీ గౌతమేశ్వర సాహితీ కళాసేవ సంస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమంలో ‘కరీంనగర్ ఫిలిం భవన్’ లో 2025 జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారం మరియు చిత్రకళారత్న బిరుదుతో పాటు స్వర్ణ కంకణం జనవరి 19న, ఆదివారం అందుకున్నాడు. జాతీయ స్థాయి అవార్డు పొందిన చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ ను 64కళలు పత్రిక అభినందిస్తుంది.