సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్

తెలుగు సినిమా హిస్టరీలో సంతోషం ఒక చెరగని ముద్ర. సంతోషం మ్యాగజైన్ … సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంతర సినీసమాచారాన్ని రీడర్ కి అందిస్తూ అజేయంగా పత్రికను నడుపుతున్నారు. నిర్మాతగా పంపిణీదారుగానూ ఆయన తనదైన ముద్రవేశారు. నేటి డిజిటల్ ట్రెండ్ కి తగ్గట్టుగా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి దిగ్విజయంగా 500 ఎపిసోడ్స్ ని రన్ చేయడం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ 26 వేల సబ్ స్క్రైబరస్ తో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సురేష్ కొండేటి గారికి 64కళలు.కాం పత్రిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. యూట్యూబ్ లో ఇంత కాంపిటీషన్ నడుమ ఇదెలా సాధ్యమైంది? అంటే దానికి కారణం.. నేటి జనరేషన్ కి నచ్చే విధంగా యూట్యూబ్ కంటెంట్ ని మలిచి శరవేగంగా సబ్ సైబర్లను సంపాదించడమే. పరిశ్రమ తాజా డెవలప్ మెంట్స్ అప్ డేట్స్ ని ఎనాలిసిస్ లను నిరంతరం అందిస్తూ సంతోషం ఫిల్మ్ న్యూస్ వైరల్ గా మారింది.

మాధ్యమం ఏదైనా పట్టువదలని విక్రమార్కుడిలా ఎదురేలేని విధంగా సతా చాటుతామని సంతోషం సురేష్ మరోసారి నిరూపించారు. కేవలం రెండు కరోనా లాక్ డౌన్ల వ్యవధిలోనే యూట్యూబ్ చానెల్ ని ఇంతగా పాపులర్ చేసిన మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. త్వరలోనే 5000 ఎపిసోడ్లు పూర్తిచేసుకోవాలని కోరుకుంటూ…
-కళాసాగర్

Santhosham Film News

https://www.youtube.com/watch?v=RPxiGCgeScU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap