‘సేవ్ స్పారో’ ఆర్ట్ కాంటెస్ట్

ప్రకృతికి మనం ప్రేమతో ఏదైనా చేస్తే దానికి పదింతలు మనకీ, మన ముందు తరాల వారికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని నేటి తరం చిన్నారులు మరియు యువతకు కలిగించి ప్రకృతి పట్ల మనకున్న కనీస బాధ్యతను తెలియపరచి… నేటి ఆధునిక, సాంకేతిక ప్రపంచంలో ప్రశ్నార్థకంగా మారిన చిరు ప్రాణి పిచ్చుకల మనుగడ పట్ల అవగాహన కల్పించి వారిలో అంతరీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసి “పిచ్చుకల” సంరక్షణ పై తీసుకోవలసిన జాగ్రత్తలు వాటి ఆవశ్యకతను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడ నగరానికి చెందిన “స్పూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పూర్తి ఉచితంగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాలకు చెందిన KG – PG విద్యార్థులకు సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ “స్ఫూర్తి” శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కాంటెస్ట్ లో పాల్గొనదలచిన విద్యార్థులు 11″ x 14″ (1/4) సైజ్ డ్రాయింగ్ షీట్ పై పిచ్చుకల సంరక్షణ అనే అంశంపై చిత్రాలు గీయవలసి ఉంటుందన్నారు.
ఆన్ లైన్ లో అప్లోడ్ చేయుటకు ఆఖరి తేదీ 10 మార్చి 2022.

సేవ్ స్పారో వెబ్ పోర్టల్ http://savesparrow.recurr.co.in పూర్తి వివరాలతో చిత్రాన్ని అప్లోడ్ చేయటం గానీ savesparrowartcontest@gmail.com కి మెయిల్ చేయటం గానీ చేయాలి.

ఒరిజినల్ చిత్రాలు మాకు పోస్ట్ / కొరియర్ ద్వారా చేరుటకు ఆఖరి తేదీ 15 మార్చి 2022. స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ # 60-22-4 / 13/2, శ్రీజ రెసిడెన్సీ, విక్రమ్ అపార్ట్మెంట్ ఎదురుగా, వాసిరెడ్డి శివరామకృష్ణయ్య వీధి, ల్యాండ్ మార్క్: లలితా జ్యూవెలరీ, గాయిత్రీ నగర్, విజయవాడ – 520008.

బహుమతి ప్రదానోత్సవం 20 మార్చి 2022 ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు “ప్రపంచ పిచ్చుకల దినోత్సవం” మార్చి 20 తేదీ ఆదివారం సాయంత్రం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పతకాలు, జ్ఞాపికలు తోపాటు బర్డ్ హౌస్ లు అందజేయబడతాయన్నారు.

మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ నందు గానీ, 9849355339 / 9390847433 (సాయంత్రం 5 నుండి 8 గంటల లోపు) ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు.

5 thoughts on “‘సేవ్ స్పారో’ ఆర్ట్ కాంటెస్ట్

  1. మంచి ఆశయం తో చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ..
    మీ.
    అంజి ఆకొండి

  2. థ్యాంక్యూ… డియర్ కళాసాగర్ గారు 64కళలు.కామ్..ద్వారా కళలకు సంబంధించిన విషయాలను ఎంతో ఓపికగా… సృజనాత్మకంగా.. కళాకారులకు,కళాభిమానులకు అందిస్తున్న మీ కృషికి సలాం.మాలాంటి వారెందరికో మీరొక రోల్ మోడల్. “పిచ్చుకల”సంరక్షణకై స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్న ఈ *సేవ్ స్పారో* కాంటెస్ట్ సమాచారం అందరికీ చేరేలా ప్రచురించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap