మరణంలేని మహా మనిషి మహానటి సావిత్రి

మరణం లేని మహ మనిషి మహానటి సావిత్రి అని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారం (6-12-21) గుంటూరు జిల్లాలోని వడ్డి వారిపాలెం గ్రామంలోని శ్రీమతి సావిత్రి గణేష్ జడ్పీ హైస్కూల్ నందు మహానటి సావిత్రి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు దారపు శ్రీనివాస్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులురాలు మట్టా జ్యోత్స్న సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సావిత్రిలోని సేవభవాన్ని కొనియాడారు. ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తిని అజరామరంగా నిలిపాయాన్నారు. మహానటి సావిత్రి పేరు విన్నంతనే ప్రతిఒక్కరి హృదయాలు ఊపొంగుతాయని ఆమెలోని సుగుణాలను పలువురు స్తుతించారు. తెలుగుదానానికి నిలువెత్తు దర్పణం ఆమెరూపమన్నారు. ఆమెలోని దేశభక్తికి నిదర్శనం 1965 లో భారత్, పాకిస్తాన్ యుద్ధసమయంలో ఆయుధసామాగ్రి సమాకూర్చుకోవడానికి నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి వంటిమీదఉన్న అత్యంత విలువైన వజ్రాలు పొదిగినఆభరణాలు విరాళం ఇచ్చి తనలోని దేశభక్తిని చాటుకున్న మహావనిత సావిత్రి అన్నారు.

ఈ సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను మహానటి సేవా పురస్కారాలు ప్రధానం చేసి గౌరవించారు నిర్వాహకులు. పురస్కారం అందుకుని ప్రసంగించినవారిలో అవనిగడ్డ సీఐ బీ.రవికుమార్, మేధావుల ఫోరమ్ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ గంటా విజయ్ కుమార్,(నందిగామ )అవనిగడ్డ సర్పంచ్ ఉమా, మీడియా,కళా, సేవారంగాల్లో విశేష సేవలందిస్తున్న బి. సుమలత (విజయవాడ )మారురి పుల్లారెడ్డి (సత్తినపల్లి) చందు (గుంటూరు)సంఘ సేవకురాలు కరరెడ్ల సుశీల, టీవీ. రంగారావు,రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పీ.సుధాకర్, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు చందు వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రముఖ విద్యావేత్త, సంఘ సేవకులు వడ్డి హనుమంతరావు, వడ్డి లక్ష్మోజీ (చంటి) రమణ (చంటి )కృష్ణా యూనివార్సిటీ శ్రీనివాస్, ప్రభాత్ కుమార్, స్థానిక సర్పంచ్, పాఠశాల కమిటీ సభ్యులు, తదితరులు ప్రతిభ పురస్కారం అందుకున్న వారిలో వున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, సంఘ సేవకులు సింహాద్రి కృష్ణప్రసాద్, బడే ప్రభాకర్, సామర్ల మల్లికార్జున రావు, అప్పికట్ల శ్రీనివాస్, లేబాక నాగేశ్వరరావు, రేపల్లె యువరాజ్, శ్రీమతి ఉషా, శ్రీమతి విజయశ్రీ, తదితరులు ప్రధానంగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హైస్కూల్ విద్యార్థిని, విద్యార్డులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap