శిల్పి సతీష్ వుడయార్ మృతి

కరోనా రెండవ వేవ్ మారణ హోమం సృష్టిస్తుంది. ఎందరో కళాకారులను మనకు దూరం చేస్తుంది. అలాంటి వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను చెక్కడంలో నిష్ణాతుడయిన శిల్పి సతీష్ కుమార్ వుడయార్ ఒకరు. లెక్కకు మించి మన రాష్ట్రంలో మహనీయుని విగ్రహాలు గ్రామగ్రామాన దర్శింప చేసిన గొప్పకళాకారుడు. 1994 నుండి ఒంగోలులో శిల్పాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వల్పంగా వచ్చే అంబేద్కర్ విగ్రహాల ఆర్డర్స్ తీసుకొని దశాబ్దకాలం పాటు ఒంగోలు కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించుకున్నారు. ఆరోజుల్లో అంబేద్కర్ విగ్రహాలు తయారీలో ఎంతో పేరు సంపాదించి ప్రకాశం జిల్లాలో విరివిగా విగ్రహాలు తయారు చేసిన యువ శిల్పిగా రికార్డ్ నెలకొల్పారు.

2011 నుండి సతీష్ కుమార్ వుడయార్ వారి స్వస్థలమయిన ప.గో. జిల్లా లోని నత్తారామేశ్వరం (గరువు)లో శిల్పాశ్రమాన్ని నిర్మించుకొని శిల్పిగా గుర్తింపు తెచ్చుకొంటున్న సమయాన మంచి కళాకారుడు, మనమెరిగిన అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి కరోనా తో మృతిచెందడం బాధాకరం. ఏలూరు ఆశ్రమం హాస్పటల్ లో కరోనా తో పోరాడి గత నెల 20 వ తేదీన అసువులుబాసారు. అయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను.

42 యేళ్ళ సతీష్ కుమార్ వుడయార్ కి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. వీరి తండ్రి కీ.శే. శిల్పాచార్య శ్రీనాథ రత్నశిల్పి వుడయార్ గారు. వీరి కుటుంబం మొత్తం శిల్ప కళారంగంలో స్థిరపడ్డారు. వీరి సోదరులు రాజ్ కుమార్ వుడయార్, హరేంద్రనాథ్ వుడయార్, సోదరి దేవికా రాణి వుడయార్ లు.
-కళాసాగర్

SA:

View Comments (1)