విజువల్ వండర్ గా ‘శాకుంత‌లం’

క్రియేటివ్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ ప్ర‌కారం చ‌క చ‌కా జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో స‌మంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. అలాగే ప్రతి పాత్రను ఎంతో గొప్పగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు మేక‌ర్స్‌. వీటి కోసం ఏం చేశారు.. ఎలాంటి రీసెర్చ్ జ‌రిగింది వంటి విష‌యాల‌పై యూనిట్ స‌భ్యులు పాత్రికేయ‌ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు…

నీతా లుల్లా మాట్లాడుతూ ‘‘దేవ్‌ మోహన్‌ ధరించిన భుజకీర్తులు మాత్రమే మూడు కిలోల బరువున్నాయి. ఆర్మర్‌లాంటి నగలు చేశాం. నా మనసులో ఉన్నవాటిని నేహా చాలా బాగా చేశారు. కంఫర్ట్ గా అనిపించింది వారితో పనిచేయడం. వాళ్లకి దాదాపు 6-8 నెలలు సమయం పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడి చేశాం. దేవ్‌ నగలను చాలా బాగా క్యారీ చేశారు. క్వీన్‌ లుక్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్వీన్‌ లుక్‌ కోసం 30 మీటర్ల డ్రస్‌ తీసుకున్నాం. ఈ జువెలరీ ధరించిన తర్వాత సమంత చాలా ఆనందంగా అనిపించేవారు. జువెలరీని పూర్తి చేసిన తర్వాతే క్యారక్టర్‌ ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో అర్థమవుతుంది. క్యారక్టర్‌, కాస్ట్యూమ్స్, జువెలరీ ఎప్పుడు ఒకదానికొకటి అందాన్ని తెచ్చిపెట్టాలి. క్వీన్‌ లుక్‌కి నాలుగు లెవల్స్ జువెలరీ వాడాం. అప్పర్‌ లెవల్‌, లోయర్‌ లెవెల్‌, హారం, వడ్డాణం వంటివి చేశాం. తల మీద ఐదు లెవల్స్ మెయింటెయిన్‌ చేసేవాళ్లం. దాని మీద పువ్వులు పెట్టేవాళ్లం. చాలా ఎక్స్ టెన్సివ్‌ ప్రాసెస్‌ అది. శాకుంతలం అందాన్ని జువెలరీతో ఎలా తీసుకురావాలోనని చాలా మాట్లాడుకున్నాం. నేహా మేడమ్‌ చేసిన జువెలరీలో మొత్తం హ్యాండ్‌ వర్క్ కనిపించింది. చాలా సిటీల్లో దీనికోసం ట్రై చేశారు. షూటింగ్‌కి మూడు రోజుల ముందే జువెలరీని తెప్పించేవాళ్లం. సమంతకు ఇబ్బంది కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ నగలు చేశాం’’ అన్నారు.

వసుంధర జువెలర్స్ నేహా మాట్లాడుతూ ‘‘నేను కింగ్‌ నగలు చేసిందానికన్నా, దేవ్‌ మోహన్‌ మీద చూసిన తర్వాతే చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకు అంత అందంగా అనిపించాయి.
మాకు సపోర్ట్ చేసి, కోపరేట్‌ చేశారు. కోవిడ్‌ టైమ్‌లో రన్‌ అవుతున్నప్పుడు అందరినీ ఒకచోట కూర్చోబెట్టి చేయడం ఇబ్బంది అయింది. అయినా చేశాం. డైరక్టర్‌, నీతాలుల్లా చేశాం. సమంత కూడా హెవీ జువెలరీ చేశారు. డెడికేషన్‌తో వాటిని ధరించారు. అన్ని గంటలు కూర్చున్నారు. నాకు పీరియడ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. పీరియడ్‌ ఫిల్మ్స్ జువెలరీ, క్లోతింగ్‌ ఈజీ కాదు. ఆ టైఫ్‌ ఆఫ్‌ అటైర్స్, జువెలరీ చేయడం చాలా కష్టం. మెషిన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఈజీ. కానీ హ్యాండ్‌ మ్యానుఫ్యాక్చర్‌ అనేది కష్టం. మైండ్‌ వర్క్, హార్డ్ వర్క్, హ్యాండ్‌ వర్క్ అది. ఇది మాకు ప్యాషన్‌. బిజినెస్‌ని ముందు నుంచీ కమర్షియల్‌గా ట్రీట్‌ చేయలేదు. టైమ్‌ డెడికేట్‌ చేసి చేశాం. ఇన్‌స్పిరేషనల్‌గా తీసుకుని చేశాం. మొత్తం ప్రాసెస్‌ని లవ్‌ చేశాం. సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు.

దేవ్‌మోహన్ మాట్లాడుతూ “ఈ ఎక్స్ పీరియన్స్ సింగిల్‌ వర్డ్ లో చెప్పలేను. కానీ ఈ జువెలరీ వేసుకున్న తర్వాత వారం రోజుల పాటు జిమ్‌కి వెళ్లలేకపోయా. మంచి అవకాశం ఇది. నీతాలుల్లా ప్రతిరోజూ డిఫరెంట్‌ జువెలరీతో వచ్చేవారు. ఆ నగలు ధరించిన తర్వాత చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది. శాకుంతలంలో నేను పార్టిసిపేట్‌ అయినందుకు చాలా ఆనందంగా అనిపించింది. బ్యూటీఫుల్‌ విజన్‌ ఉన్న మూవీ ఇది. శకుంతల లుక్‌ కోసం నేను కూడా అందరిలాగా ఈగర్‌గా వెయిట్‌ చేశా. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. సమంత ఆ లుక్‌లో కనిపించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఆ సీన్‌లో యాక్ట్ చేయలేదు. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాను. ఆ దృశ్యాలు సినిమాలో చూడొచ్చు” అన్నారు.

Samantha as Shakunthala

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ “క్వీన్‌ లుక్‌ని చూడటానికి అందరం కలవడం ఆనందంగా ఉంది. నీతా లుల్లాగారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కాస్ట్యూమ్‌ డ్రామా అనగానే మేం నీతా మేడమ్‌కి ఫోన్‌ చేశాం. మంచి జువెలరీ కి స్కోప్‌ ఉన్న సినిమా చేస్తున్నాం అనగానే వసుంధర వాళ్లను కలిశాం. వాళ్లు ఆన్‌బోర్డ్ కావడం చాలా ఆనందంగా అనిపించింది. మా కలలు నెరవేర్చడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. సమంత ఈ లుక్‌లో గోల్డెన్‌గాడ్‌లాగా కనిపిస్తున్నారు. పౌరాణిక సినిమాల్లో క్వీన్‌ లుక్‌ చాలా ఇంపార్టెంట్‌. వసుంధర బ్రాండ్‌తో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ లుక్‌ని సమంత చాలా బాగా చేశారు. ప్రతిరోజూ అన్నినగలు ధరించి సన్నివేశాలు చేయడం చాలా ఆనందంగా అనిపించింది. దేవ్‌మోహన్‌గారు కూడా చాలా ఆనందంగా వేసుకుని చేశారు. ఏడు రోజులు 15 కిలోలు ధరించి సన్నివేశాలు చేశారు. మధ్యలో తీసేయమని చెప్పినా, తీసేవాడు కాదు. శరీరం మీద మార్కులు కూడా పడ్డాయి అతనికి” అన్నారు.

హన్షిత మాట్లాడుతూ ‘‘ఒక మూవీకి స్టోరీ, కేరక్టర్లు, యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో, పీరియాడిక్‌ సినిమాకు కాస్ట్యూమ్స్, జువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్‌. నీతా మేడమ్‌ అంతే బాగా చేశారు. సమంతను ఇప్పటిదాకా చాలా సందర్భాల్లో చూశారు. ఏప్రిల్‌ 14న మా సినిమాలో చూస్తారు. వసుంధర జువెలర్స్ నాకు చాన్నాళ్లుగా తెలుసు. ఈ సినిమాకు ఇంకా బాగా తెలిశారు. ఇంత జువెలరీ క్యారీ చేశారు. సమంత, దేవ్‌మోహన్‌ చాలా గ్రేస్‌తో క్యారీ చేశారు.

దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘నిజమైన బంగారం వాడాం శాకుంతలంలో. ఈ ఐడియా ఫస్ట్ నందమూరి తారక రామారావు దానవీరశూరకర్ణలో ధరించారు. ఆయన మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఇలాంటి మైథలాజికల్‌ మూవీస్‌కి ఆయనే మూలకారకుడు. వసుంధర జువెలర్స్ బ్యానర్‌ మాతో అసోసియేట్‌ అవుతుందంటే ఆనందంగా అనిపించింది. నీలిమ వాళ్లకు తీసుకొచ్చింది. వాళ్లకి కూడా టేస్ట్ ఉండటం వల్ల ఇమీడియేట్‌గా వచ్చారు. ఇలాంటివారందరినీ శాకుంతల ప్రాజెక్ట్ అట్రాక్ట్ చేసింది. సమంతగారితో మొదలుపెట్టి, ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ కి అసోసియేషన్‌ అవ్వాలో, అందరినీ అట్రాక్ట్ చేసింది ప్రాజెక్టు. దాదాపు 14 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు వాడాం. బంగారం మాత్రమే కాదు, రియల్‌ డైమండ్స్ వాడాం. దేవ్‌మోహన్‌ లుక్‌, సమంతగారి లుక్‌ అందరూ చూశారు. ప్రతిరోజూ ఆర్టిస్టులు సెట్‌కి ఎగ్జయిట్‌మెంట్‌తో వచ్చేవారు. నేహాగారు, నీతాలుల్లాగారు డిజైన్‌ చేసిన జువెలరీని చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వచ్చేవారు. క్వీన్‌ లుక్‌ వచ్చినప్పటి నుంచి సమంతగారి ఎగ్జయిట్‌మెంట్‌ చాలా ఎక్కువగా అనిపించింది. అవి చాలా బరువు. వాటిని హుందాగా క్యారీ చేయడం చాలా బాగా అనిపించింది. అందరికీ కళల పట్ల ఉన్న అభిమానమే చాలా బాగా వచ్చింది. మధుబాలగారు మేనకగా చేశారు. ఆమె జువెలరీ రియల్‌ డైమండ్స్ తో చేశాం. ఆమె ఒంటిమీద ఉన్న నగలు దాదాపు ఆరు కోట్ల విలువ చేశాయి. వాళ్లు చాలా బాగా ఎంజాయ్‌ చేశారు. ఏప్రిల్‌ 14న కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. శాకుంతలం అనగానే వనంలో కనిపించేదే కాదు, రాచరికంలో ఉన్న వైభవాన్ని కూడా చూసి ఆస్వాదిస్తారు. వసుంధర ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కష్టపడి చేశారు. చిన్న డీటైల్‌ కూడా మిస్‌ కాకుండా పనిచేశారు. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు. బెస్ట్ పీపుల్‌ కలిసి ఇదంతా చేశారు. కచ్చితంగా అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం” అన్నారు.

క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్లు

  • గుణశేఖర్‌ సినిమాలంటేనే భారీ సెట్లు, భారీ నిర్మాణం వంటివి పర్యాయపదాలు…
  • మన పూర్వీకులు సెట్‌ చేసి పెట్టిన స్టాండర్డ్స్ విన్నాం. శకుంతల సినిమాటిక్‌ ఎడాప్టేషన్‌ గురించి మాట్లాడుకోవాలి. 1940లో శకుంతలై అనే తమిళ సినిమా వచ్చింది. దాన్ని హాలీవుడ్‌ డైరక్టర్‌ చేశారు. అందులో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మిగారు శకుంతలగా నటించారు. మహాభారతంలోని ఆదిపర్వంలో వచ్చిన శకుంతల దుష్యంతుల కథని కాళిదాసు అద్భుతంగా అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో చేశారు. స్టేజ్‌ అడాప్టేషన్‌ అద్భుతంగా చేశారు. సినిమా డెవలప్‌ అవుతున్న క్రమంలో శకుంతలై పేరుతో చేశారు. వాళ్లు ట్రెండ్‌ సెట్‌ చేశారు. రామారావుగారు ఒక మూవీ చేశారు. శాంతారామ్‌గారు ఒకటి చేశారు. 60-70 ఏళ్లుగా ఎవరూ చేయలేదు. టైమ్ లెస్‌ క్లాసిక్‌ ఇది.
  • దేవ్‌గారు 15 కిలోలు మోశారు… సమంతగారు ఎన్ని కేజీల బరువు మోశారు?
  • ఆవిడ మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఆవిడ కనిపించడానికి డెలికేట్‌గా కనిపిస్తారు. కానీ, చాలా స్టామినా ఉంటుంది. నీలిమ పంపించడం… ‘నీలిమా ఎన్ని కేజీలు పంపావు’ అని అడిగేవారు. సినిమావాళ్లకు సమస్యలన్నీ ఇంటిదగ్గరే. సెట్‌కి వస్తే ఎంజాయ్‌ చేసి చేసేవారు.
  • ఇంత జువెలరీతో గ్రాండియర్‌గా చేశారు. టోటల్‌ ఎక్స్ పెండిచర్‌… సినిమాకి ఏ రేంజ్లో గెయిన్‌ అవుతుంది? ఆడియన్స్ కి ఎలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది?
  • ఆ రోజున రామారావుగారు నిజమైన బంగారంతో ఆథంటిసిటీ కోసం చేసేవారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే నిజమైన నగలు ధరించారు. ఇప్పుడు డిజిటైజ్‌ అయింది. ఫేక్‌ జువెలరీ ఆన్‌స్క్రీన్‌ తెలిసిపోతోంది. నేను 14 కోట్లు పెడతాను నిజమైన జువెలరీకి అంటే దిల్‌రాజుగారు భయపడేవారు. కానీ, నీలిమ ఇలా వసుంధరవాళ్లతో టయ్యప్‌ అయి చేసిందని చెప్పగానే ఆయన రిలీఫ్‌ అయ్యారు. అయితే బావుందని అన్నారు. మనకు ఇలాంటి కళాభిమానులున్నారు. వసుంధర వాళ్లు ఆర్ట్ లవర్స్. వాళ్లు కమర్షియల్‌గా లెక్కేసుకుంటే, వాళ్లకు నష్టమే. కానీ మైథలాజికల్‌ సినిమాతో వెళ్లినప్పుడు బాధ్యతగా తీసుకున్నారు. రూపాయి పెట్టిన ప్రేక్షకులు ఒక తృప్తితో వెళ్లారు. ముందు మా ఎఫర్ట్ 100 శాతం చేశాం. ఆ ప్రయత్నంతోనే రియల్‌ నగలు వాడాం.
  • ఇదే ప్రశ్నకు ..నీతా లుల్లా సమాధానమిస్తూ… 1940లో శకుంతలై చేశారు. ఇవాళ్టికీ మాకు ఆ సినిమా, ఆ లుక్‌, ఆ జువెలరీ స్ఫూర్తినింపింది. ఆ లుక్‌, ఆ అందమైన అనుభవం మాలో స్ఫూర్తి నింపింది. అలాంటి స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించాలంటే, ఈ డిజిటల్‌ మీడియంలో ఇది సరైన విషయం. నేను కామిక్‌ బుక్స్ , చందమామ, అమరచిత్రకథల్లో చూస్తూ పెరిగా. కానీ భావి తరాల వాళ్లకు ఓ రెఫరెన్స్ గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అంత వర్త్ ఉన్నవాటిని చేశాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap