శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

మస్తక పోలాల్లో విజ్ఞాన విత్తులు చల్లేది పుస్తకమే. అలాంటి వందకు పై చిలుకు పుస్తకాలను రాజమండ్రి, గోరక్షణపేట లోని డైమండ్ పార్కు లో ఉన్న శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు మోమోరియల్ మున్సిపల్ లైబ్రరీ & ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంధాలయాలకి ఈ పుస్తకాలు అందచేసామని మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ వ్యవస్దాపకులు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. సుప్రసిద్ద రచయిత చిత్రకారులైన శీలా వీర్రాజు స్వీయ రచనలు, ఆయన సేకరించిన ప్రముఖులైన కవులు రచయితలు రాసిన పుస్తకాలను లైబ్రరీకి అందచేసామన్నారు. హైద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఈ పుస్తకాలు తీసుకొచ్చామన్నారు. రాజమండ్రి మీద ఉన్న మమకారంతో ఆయన ఈ పుస్తకాలు విద్యార్దులు యువత ఉపయోగించుకొని లక్ష్యంతో అందించారన్నారు. సుమారు పదివేల రూపాయలు విలువ కల్గిన పుస్తకాలు చైతన్య అస్త్రాలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లైబ్రరీ & ట్రస్టు ఛైర్మన్ వి.జగపతిరావు మాట్లాడుతూ 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు అజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రఖ్యాతులైన రచయితల పుస్తకాలు మాకు అందచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ లైబ్రరిని ఉపయెాగించుకొని అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజేతలయ్యారన్నారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాసు, పి.యస్. రవికాంత్ విద్యార్దినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap