షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు చివరి తేదీ : జూన్ 15,2020.
ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ మేకర్స్, మిత్రులకు, అవని క్రియేషన్స్ శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా, ఈ నెల అనగా ఏప్రిల్ 19వ తేది (ఆదివారం)న నిర్వహించాల్సిన “అవని క్రియేషన్స్ ” 9వ వార్షికోత్సవాన్ని ప్రస్థుతం “కరోనా వైరస్” వల్ల సమాజంలో నెలకొన్న పరిస్టితుల కారణంగా కార్యక్రమన్ని జూన్ నెలకు వాయిదా వేయడం జరిగింది. కావున షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను జూన్ నెల 15 వరకు పొడిగిస్తున్నాము. కావున ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ కళాకారులు తమ చిత్రాలను 15వ తేది లోగా పోటికి పంపిచంచగలరు.
రెండు కేటగెరిస్ (షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ) లలో జరిగే ఈ పోటీలలో ప్రతీ కేటగెరిలోనూ మొదటి బహుమతి రూ. 10,000/-, రెండవ బహుమతి రూ. 5000/- , చిత్రాలు 20 నిమిషాల లోపు నిడివి కల్గి వుండాలి.
కార్యక్రమానికి సంబంధించిన వివరాల కొరకు సాత్వికా ప్రవీణ్ (96432434461),
నందు (9985898063)ను సంప్రదించగలరు.
-సాత్వికా ప్రవీణ్ (అవని క్రియేషన్స్)