విజయవంతంగా ‘షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’

ఆగిరిపల్లి – తాడేపల్లిలో గల డాక్టర్ కే.కే.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్లో (Dr. KKR Happy Valley School) 27-4-2025, ఆదివారం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ మహెూత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డా. కే.కే.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్ వారి సౌజన్యంతో, 64 కళల డాట్ కామ్ మరియు స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ నిర్వహణలో జరిగిన ఈ పోటీకి… సుమారు ఎనబై కి పైగా లఘు చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నమోదు కాబడ్డాయి.

అందులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం గా ‘థాంక్ గాడ్‘ (Rouphu Sheik – Rajahmundry) అనే లఘు చిత్రానికి లక్ష రూపాయల నగదుతో ప్రథమ స్థానం,
సెకండ్ బెస్ట్ ఫిలిం గా ‘నేస్తం’ (Ashok Baliga – Machilipatnam) అనే లఘు చిత్రం 50 వేల రూపాయలు నగదుతో ద్వితీయ స్థానం,
థర్డ్ బెస్ట్ ఫిలిం గా ఉపవాసం (Vijaya Anand – Hyderabad) అనే లఘు చిత్రం 30 వేల రూపాయల నగదు బహుమతితో తృతీయ స్థానాలు దగ్గించుకున్నాయి.

స్పెషల్ జ్యూరీ అవార్డులు పది వేల రూపాయలు నగదు గెలుచుకున్న చిత్రాలుగా
1) ఋణబంధం (M. Ramaswamy – Ramagundam),
2) కనిపించని త్యాగం (Dhanush Kumar – Tenali) చిత్రాలు నిలిచాయి.

జ్యూరీ అవార్డులు (రూ. 7000/- నగదు) పొందిన చిత్రాలు వరుసగా…
1) మా నాన్న పసివాడే, (Gade Nagabhushanam – Vundavalli, Guntur dist.)
2) రూపాయి (BSK – Hyderabad)
3) పునరపి జననం (Mahadev – Hyderabad),
4) పండుటాకులు, (Ananth Palaparthi – Nellore),
5) హ్యుమానిటి (R. Bhargav Roy – Vijayawada),
6) చెట్టు ( T. Anusha – Hyderabad) 7)
7) ఆడపిల్లను వద్దంటే అమ్మను వద్దన్నట్లే.. (Poulu Raju – Kruttivennu, Krishna dist.).

ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ కొసరాజు కోటేశ్వరరావు మాట్లాడుతూ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న సభ్యులందరినీ వారు చేసిన కృషిని అభినందించారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రంతోపాటు జ్ఞాపికలు అందజేశారు. ప్రత్యేక జ్యూరీ విభాగంలో మరికొన్ని షార్ట్ ఫిలింలకు లకు నగదు బహుమతులు అందజేశారు. 64 కళల డాట్ కామ్ అధినేత కళాసాగర్ మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిలంస్ కాంటెస్ట్ లో పాల్గొన్న ఫిల్మ్ మేకర్స్ కు, అనేక ప్రాంతాలనుండీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి శ్రీనివాస్, వరప్రసాద్, విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ఫిల్మ్ మేకర్స్, నటీనటులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవార్డుల బహుకరణకు ముందుగా బహుమతులు గెలుచుకున్న షార్ట్ ఫిలంలను ప్రదర్శించారు.

అవార్డుల బహుకరణకు ముందుగా బహుమతులు గెలుచుకున్న షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. తమ తమ చిత్రాలను థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూసుకొని మేకర్స్, నటీనటులు ఎంతో సంతోషపడ్డారు.

Available Award Winning Short Film links:
First Best Film: Thank God
https://www.youtube.com/watch?v=SfpZ_TeQ-QY
Jury : Upavaasam
https://www.youtube.com/watch?v=FF1-7PRZM9c
Special Jury : Runabandham
https://www.youtube.com/watch?v=lmp_WUFXmPw
Special Jury : Kanipinchani Tyagam
https://www.youtube.com/watch?v=_C2NZEfHuus
Jury : Humanity
https://www.youtube.com/watch?v=WG3IuhGXYic
Jury : Pandutaakulu
https://www.youtube.com/watch?v=-6oGHHuhUn8
Jury : Punarapi Jananam
https://www.youtube.com/watch?v=dKMaYfyvPlo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap