‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఏపీ మహిళాకమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాచరణ -2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర( షార్ట్ ఫిల్మ్స్) రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని మంగళవారం (30-08-22) ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెట్టి ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘుచిత్రాలు తీసి పంపాలని ఆమె ఆహ్వానించారు. కమిషన్ నియమించిన జ్యూరీ పరిశీలన తర్వాత ఉత్తమ లఘుచిత్రాల ఎంపిక చేసి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఐదు ప్రత్యేక బహుమతులు ప్రకటిస్తామన్నారు. వీటితోపాటు ఉత్తమ నటి, నటుడు, రచయిత, దర్శకత్వ ప్రతిభను గుర్తించి వ్యక్తిగత బహుమతులు అందజేస్తామన్నారు.
ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన ప్రథమ బహుమతికి రూ. లక్ష, ద్వితీయ బహుమతికి రూ. 50 వేలు, తృతీయ బహుమతి కింద రూ. 25 వేలు కాగా, ఐదు ప్రత్యేక బహుమతులకు ఒక్కోదానికి రూ.20 వేల చొప్పున, వ్యక్తిగత బహుమతులకు ఒక్కోటి రూ. 20వేల చొప్పున అందజేస్తామన్నారు.

ఆఖరి తేదీ: సెప్టెంబరు 25వ తేదీలోగా లఘుచిత్రాలను పెన్ డ్రైవ్ ద్వారా గాని లేదా వీడియో లింకును apwcshortfilm2022@gmail.com మెయిల్ కి పంపాలన్నారు.
అక్టోబర్ 1వ తేదీన రాజమండ్రి వేదికగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.

లఘుచిత్రం అంశాలు:
1. మహిళలు – సమానత్వం – 50% మహిళా రిజర్వేషన్ అమలు
(అనాది సాంప్రదాయ కట్టుబాట్లను చేధించి.. బాల్యం నుంచి బాలింత దశ వరకు పురుషులతో సమానంగా పెంపకం, పోషణ, విద్య, ఆస్థిపంపకం, ప్రోత్సాహంతో పాటు..వంటింటికి పరిమితమైన మహిళకు అన్నిరంగాల్లో పనులు, పదవులు 50శాతం మహిళా రిజర్వేషన్ తో కల్పించడం.. ఆత్మగౌరవాన్ని కాపాడి వారిలో మనోస్థైర్యం నింపడం, ఆర్ధికస్వావలంబన, రాజ్యాధికార పురోగతి, నిర్ణయాధికారశక్తిగా ఎదగడం)

 1. మహిళా సంక్షేమం – ప్రభుత్వ పథకాలు – సాధికారత సాధన
  ( ఏదైనా ఒక గ్రామం క్షేత్రస్థాయి పరిశీలనతో గ్రామీణ, పట్టణ మహిళా జీవనశైలి మార్పులను యదార్ధ కథనాలు ఆవిష్కరిస్తూ..)
 2. మహిళా భద్రత, రక్షణ – ‘దిశ’ అమలు

నిబంధనలు:

 • పై మూడు అంశాల్లో ఏదొక ఒక అంశం పై గాని.. అన్ని అంశాలు కవరయ్యే విధంగా గాని లఘుచిత్రం తీయవచ్చు.
 • కులమతాలకతీతంగా అశ్లీలతకు తావిలేని విధంగా లఘుచిత్రాలు ఉండాలి.
 • యానిమేషన్ చిత్రాలు అనుమతించబడవు.
  -టీవి సీరియల్స్ లేదా కేబుల్ టీవిల కోసం చేసినవి అనుమతించబడవు.
  -ఒక్కరు ఎన్ని ఎంట్రీలైనా పంపవచ్చు.
  -మీరు రూపొందించే లఘుచిత్రం 7 నిమిషాలలోపు వ్యవధి కలిగి ఉండాలి.
 • చిత్రాలు తెలుగు భాషలో మాత్రమే నిర్మించాలి.
 • కచ్చితంగా ఈ సంవత్సరం తీసినదై ఉండాలి.
 • తుది నిర్ణయం ‘మహిళా కమిషన్’ వారిదే..
 • రిజిస్ట్రేషను వివరాలను మెయిల్ కి పంపాలి. రిజిస్ట్రేషన్ ఉచితం.
 • వివరాలకు 08645-294900, 9381243599, 9441356482 సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap