మా తమ్ముడు చిరంజీవి దార్ల మురళీకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్ గా, ఎన్నో ప్రాజెక్టులకు తన కళా నైపుణ్యంతో పూర్తి చేస్తూ, తీరిక వేళల్లో కవితలు రాయడం, చిత్రకళల పట్ల ఆసక్తి చూపేవాడు. నా సలహా మేరకు, అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన రోజున, “సంక్షిప్త రామాయణం – శ్రీరామ చరితము – మోక్ష మార్గము” వ్రాయడం ప్రారంభించి, సంవత్సరం పాటు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ 365 రోజుల రామాయణం సంపుటిలను పూర్తి గ్రంథరూపము కల్పించాలని, కనీసం కొన్ని పుస్తకాలు అయినా ప్రింట్ చేయాలని తలచి, ప్రింటింగ్ చేయించడం జరిగింది.
1/4 డెమ్మీ సైజులో 972 పేజీలలో కొన్ని రంగుల చిత్రాలతో అందంగా ప్రచురించిన ఈ గ్రంథంలో బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు పొందుపరచడం జరిగింది.

ఈ గ్రంథపుష్పమును ఈ నెల మార్చి 15 వ తారీఖు, ఆదివారం నాడు, హైదరాబాద్, సరూర్ నగర్ లో ఉన్న మా స్వగృహమైన దార్ల నిలయము నందు గౌరవ అతిథి మరియు ప్రముఖ కళాకారిణి, శ్రీమతి విజయ ఆయంచ గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. బుక్ టైటిల్ పేజీపై రూపొందించిన కళాకారిణి శ్రీమతి సంగీత సంగిశెట్టి గారు., శ్రీమతి కాసుల పద్మావతి గారు ఆర్టిస్ట్, శ్రీమతి ఎమ్. రంగ సాయీశ్వరి గారు , ఆర్టిస్ట్,. శ్రీమతి సుధా ఎస్. రస్తోగి గారు, ఆర్టిస్ట్., శ్రీమతి ఉమ తిరుమల శెట్టి గారు, ఆర్టిస్ట్., శ్రీమతి హేమమాలిని గారు, ఆర్టిస్ట్ తదితరులు విచ్చేసిన మహిళా కళాకారులకు చిరు సత్కారించిన అనంతరం ఈ గ్రంథమును సంపూర్తి చేయడంలో తోడుగా నిలిచినవారికి, శ్రీ దార్ల మురళీకృష్ణ, శ్రీమతి నిర్మల దంపతులు, కుమారి లలిత, మరియు కుమారుడు రవితేజ కుటుంబ సభ్యులచే చిరు సత్కారంతో పాటు ఈ గ్రంథాన్ని సగౌరవంగా అందజేశారు. తర్వాత “సంక్షిప్త రామాయణం” గ్రంథంతో పాటు దార్ల బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్స్ లను బహూకరించడం జరిగింది.
రామాయణ గాథలను వర్ణిస్తూ మహిళా కళాకారులు చిత్రీకరించిన వారి చిత్రాలను ఈ సంక్షిప్త రామాయణం గ్రంథ పుస్తకంలో ప్రచురించేందుకు ఎన్నిక చేయబడినందుకు, ఆ గ్రంథ పుస్తకమును బహూకరించినందులకు గాను, వారి సంతోషానికి అవధులు లేవని హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఆది కవిగా వాల్మీకి మహర్షి, ప్రప్రథమంగా సంస్కృతంలో రచించిన సంపూర్ణ రామాయణం ను ఆధారంగా చేసుకుని ఎంతోమంది రామభక్త కవులు తమతమ ప్రాంతీయ భాషల్లో తమదైన శైలిలో రచించిన రామాయణమును ప్రజలకు అందించారు. ఈ నేపథ్యంలో, తమ్ముడు దార్ల మురళీకృష్ణ రూపొందించిన ఈ సంక్షిప్త రామాయణం – శ్రీరామ చరితము – మోక్ష మార్గము గ్రంథము కూడా కూడా తగిన గుర్తింపు రాగలదని ఆశిస్తున్నాను.
డా. దార్ల నాగేశ్వరరావు
రెప్లికా ఆర్టిస్ట్, హైదరాబాద్.
