ఆడియో రిలీజ్ ఫంక్షన్ లైవ్ లో చూస్తుంటే వినిపించే పేరు శ్రేయాస్ మీడియా.
టాలీవుడ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ మొదలుపెట్టింది ఇదే. అడ్వర్టైజింగ్ ని, సినిమాకి కనెక్ట్ చేసేందుకు ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన శ్రీనివాస్ మానస పుత్రిక ఇది. కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీని కలర్ ఫుల్ చేసిన ఓ పల్లెటూరి పాల వ్యాపారి కొడుకు ప్రకటనల్లో ఓ పాఠంగా చెప్పుకునేంత ఎత్తుకు ఎదిగిన కథ పేరే శ్రేయాస్ మీడియా’. అయితే విశేషం ఏమిటంటే, శ్రేయాస్ మీడియా వెయ్యి ఫంక్షన్ ల మైలు రాయిని చేరుకోవడం. సినిమా ఫంక్షన్ ల, షాప్ ల ఓపెనింగ్ లు, పెళ్లిళ్లు, ఇంకా, ఇంకా ఇలా రకరకాలైన 1000 ఫంక్షన్లను విజయవంతంగా నెరవేర్చిన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
శ్రీనివాసి కి చిన్నప్పటి నుంచి సినిమాలం అటే బాగా ఇష్టం. రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్… సినిమా చూసే అవకాశాలు చాలా తక్కువ. అయితేనేం శ్రీనివాస్ తన ఫ్రెండ్స్లో ఓ రాత్రి ప్లాన్ వేసిండు.
రాత్రి భోజనం తిన్న తర్వాత గోడదూకారు. హైవేపై పోయే లారీ ఎక్కి, కల్లూరు లో దిగారు. ‘రిక్షావోడు’ సినిమా సెకండ్ షో చూస్తున్నారు. ఇంటర్వెల్ కు ముందు.. ఓ టార్చ్ లైట్ వెలుతురు థియేటర్ అంతా పడుతూ శ్రీనివాస్ ముఖంపై పడ్డాక ఆగిపోయింది. ఆ టార్చ్ లైట్ దగ్గరకు వచ్చి ఆఫ్ అయింది. చూస్తే వార్డెన్. అతన్ని, ఇంకో అయిదుగురు పిల్లల్ని తీసుకుపోయిండు. ఇట్లయితే కష్టమని ఇంటికి పంపిండు. అయినా సరే స్కూల్ డేస్ ని ఎంజాయ్ చేసిండు శ్రీనివాస్. సినిమాలు చూడ్డమే కాదు హాస్టల్ మేట్స్ కలిసి సినిమా కథని నాటకంగా ప్రదర్శించేవాళ్లు. సిని మాలతో చదువు సాఫీగా సాగిపోయింది. ఇంట ర్మీడియట్ పూర్తయింది. అప్పటి దాకా శ్రీనివాస్ ని అమ్మమ్మ రాజమ్మ పెంచింది. ఇప్పుడు నేను చది విస్తానని మేనమామ శ్రీనివాసరావు హైదరాబాద్ తీసుకొచ్చిండు.
ఫస్ట్ ఈవెంట్ : ఖమ్మం జిల్లాలోని కల్లూరుకు దగ్గరలో ఉన్నయజ్ఞ నారాయణపురం అనే చిన్న పల్లెటూళ్లో పెరిగిన అబ్బాయి చిక్కడపల్లి అరోరా కాలేజీ అడుగుపె ట్టిండు. ఇంగ్లీష్ మీడియం చదువు, భయపెట్టే ‘ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్’ మాటలు వినలేక బ్యాక్ బెంచ్ కి మారిండు. ఈవినింగ్ ట్యూషన్ కి పోయి చదువుని పట్టాలెక్కించిండు. సెకండ్ ఇయరకు రాగానే సీన్ మారింది. ఫ్రెషర్స్ డే పార్టీ బాధ్యతని శ్రీనివాస్ భుజానేసుకున్నడు. రొటీన్ గా జరిగే పార్టీని కలర్‌ఫుల్ గా మార్చిండు. డ్యాన్స్ ను, అందాల పోటీలతో జోష్ ఫుల్ గా ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసిండు. ఈవెంట్ ఖర్చుల కోసం స్పాన్సర్ని సంపాదించి త్యాగ రాయ గాన సభలో ఈవెంట్ ని డిజైన్ చేసిండు.
ట్రెండ్ సెట్టర్ : శ్రీనివాస్ మేనమామ కస్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నడు. అందులోకి రమ్మని తన మీద ప్రెజర్. మేనమామ ఫ్రెండ్ చంద్రమౌళి మాత్రం నీకు ఇష్టమున్న ఫీల్డులోకే పొమ్మన్నడు. మీడియాలో క్రియేటివిటీకి అవకాశాలుంటయని ఎంకరేజ్ చేసిండు. మీడియాలో తనకున్న పరిచయాలతో రికమండ్ చేసి, ఓ టీవీ ఛానల్ కి పంపించిండు. ఉద్యో గం వచ్చింది. మూడు రోజులకే జాబ్ మానేసిండు. ఉద్యోగం ఇష్టం లేకపోతే తన అడ్వ రెజింగ్ ఏజెన్సీలో చేయమని అరుణ్ సాగర్ ఆఫర్ ఇచ్చిండు. అట్ల 24 ఫ్రేమ్స్’లో చేరిండు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ కి పోయిండు. టీవీలో మీ సర్వీస్లను ప్రమోట్ చేస్తూ న్యూస్ ఛానల్స్ లో స్కోలింగ్ వేయిస్తానంటే.. అడ్వర్టైజ్ మెంట్స్ స్కోలింగ్ చేయరుకదా అని అన్నడు. ‘నేను చూ సుకుంటాను’ అని చెప్పి శాటిలైట్ టీవీ సోలింగ్ లో ప్రకటన’ అనే స్లగ్ చేర్చి అడ్వర్టైజింగ్ ని కొత్త ట్రెండ్లోకి తీసుకుపోయిండు.
స్మాల్ ఆఫీస్.. బిగ్ డ్రీమ్ : స్కోలింగ్ యాడికి 21 వేలరూపాయల లాభం వచ్చింది. ఆ డబ్బుతో ఆఫీస్ ఓపెన్ చేసిండు. పది వేలు పెట్టి పాత కంప్యూటర్ కొన్నడు. చిన్న చిన్న యాడ్స్ తెస్తూనే పెద్ద పెద్ద కంపెనీలకు గాలం వేస్తూ ఉండేవాడు శ్రీనివాస్. వయసు చిన్నదే కానీ బిగ్ డ్రీమ్స్ తో బయలెల్లిండు శ్రీనివాస్. ఓ రోజు బిగ్ సీ మొబైల్స్ ఛైర్మన్ ని కలిసిండు. వయసు చిన్నది. అనుభవం లేదనుకుని ‘నువ్వేం చేస్తావ య్యా’ అన్నారట. ‘సార్ నాకు మంచి టీమ్ ఉంది. చేస్తానన్న నమ్మకం ఉంది’ అని హామీ ఇచ్చిండు. అయినా వాళ్లు అడ్వాన్స్ ఇయ్యలే.సొంత డబ్బుతో తనే యాడ్ ఫిల్మ్ తీసిండు. అది చూశాక డబ్బులి చ్చారు. నెల రోజులు ఆ యాడ్ ని టీవీల్లో వచ్చేలా ప్యాకేజ్ కుదిరింది. తర్వాత చార్మీతో బిగ్ సీ మొబైల్స్ యాడ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ యాడ్స్ అన్నింటికీ శ్రీనివాసే క్రియేటివ్ హెడ్! ప్రకటనల్లో బ్రాండ్స్ తో పాటు శ్రీనివాస్ క్రియేటివిటీ కి కూడా ప్రమోషన్ వచ్చింది. శ్రీనివాస్ ప్రత్యేకత గుర్తించి ఎంఎల్ సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ రోజు ఫోన్ చేసిండు. ఒక హోమియోపతి డాక్టర్ (హోమి యోకేర్ ఇంటర్నేషనల్)ని కలవండి. తనకు ప్రమో షన్ కావాలని రిక్వెస్ట్ చేసిండు. శ్రీనివాస్ ఆ డాక్టర్ ని కలిసి ‘ ఏ బజారుకుపోయినా హోమియోపతి డాక్టర్ బోర్డు కనిపిస్తుంది. ఇదంతా అనార్గనైజ్డ్ గా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేయగలిగితే విపరీతమైన ఆదాయం ఉంటుంది’ అని ఓ సలహా ఇచ్చిండు. వేయి రూపాయల నోట్లు పది చేతిలో పెట్టి ప్రమో షన్ స్టార్ట్ చేయమన్నడు. ఓ టీవీలో లైవ్ డిస్క షన్ పెట్టించి, డాక్టర్ తో ఫోన్ ఇన్ మాట్లాడించే అవకాశం ఇచ్చిండు. పెయిడ్ ప్రోగ్రామ్ ఐడియా టీవీ ఇండస్ట్రీకి కొత్త లాభాలను రుచి చూపించింది.
అన్ని ఛానలో శ్రీనివాస్ పరపతి పెరిగింది.
‘జల్సా’తో జోష్ : ‘మహానంది’ సినిమానిన్యూస్ ఛానల్ లో స్కోలిం గ్ చేస్తే మంచి రెస్పాన్స వచ్చింది. అప్పుడు ‘జల్సా’ సినిమా తీస్తున్నారు. సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తే బాగా ప్రమోషన్ వస్తుందని శ్రీనివాస్ చెప్పిండు. ‘చాలా ఖర్చవుతుంది వద్దులే’ అన్నడు అల్లు అరవింద్. ‘మీరు రూపాయి ఇవ్వొద్దు. నేను నడిపిస్తా’ అని చెప్పిండు. ఇప్పటి దాకా టాలీవుడ్ లో ఆడియో రిలీజ్ పెద్ద ఈవెంట్లుగా చేయట్లేదు. సినిమా ఆఫీస్లో చిన్న బ్యానర్ పెట్టి ఆడియో రిలీజ్ చేసేవాళ్లు. శ్రీనివాస్ ఓ న్యూస్ ఛానల్మే నేజ్ మెంట్ ని కలిసి, సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెద్ద ఎత్తున చేస్తున్నం. చాలా మంది సెల బ్రిటీలు వస్తారు. పది లక్షల రూపాయల విలువచే సేయాడ్స్ ఇమ్మని అడిగిండు. ఆయా ని బిగ్ సీ’ మొబైల్స్ కి అమ్మిండు. ప్రొడ్యూసర్ కి పైసా ఖర్చు లేకుండా జల్సా ఆడియో ఫంక్షన్ ని అంగరంగ వైభవంగా చేసిండు. ఆ తర్వాత తెలిసిందే! ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లైవ్ టెలికాస్ట్ కి ఛానల్స్ పోటీపడుతున్నయ్. ఇలా 2008లో గేమ్ ఛేంజ్ అయింది. 2010లో న్యూస్ ఛానల్స్ ద్వారా మూవీ ప్రమోషన్ మొదలుపెట్టిండు. సినిమా ప్ర మోషన్, ఈవెంట్స్ మేనేజ్ మెంట్ కోసం ‘శ్రేయాస్ మీడియా కంపెనీ’ని స్టార్ట్ చేసిండు.
సిల్వర్ స్క్రీన్‌పై ఫ్యూచర్ : డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు తొలిప్రేమ సినిమా రిలీజైంది. సినిమా టైటిల్స్ లో ప్రొడ్యూ సర్ పేరు ‘జీవీజీ రాజు’ అని పడింది. అప్పుడే.. ‘నా పేరు వెండితెరపై చూసుకోవాలి. ప్రొడ్యూసర్ కావాలి. అదే నా గోల్ ‘ అని డిసైడ్ అయిండు. 2010లో శ్రీనివాస్ కి డైరెక్టర్ మారుతి పరిచయం అయిండు. ఓ రోజు తను శ్రీనివాస్ కి ఓకథ వినిపిం చిండు. వెంటనే ‘ స్టోరీ అదిరిపోయింది’ అన్నడు శ్రీనివాస్. మనమే సినిమా తీద్దామంటూ లక్ష రూపాయల చెక్కుని అడ్వాగా చేతికిచ్చిండు. సినిమా పూర్తవ్వాలంటే అరవై లక్షలు కావాలి. అంత డబ్బు లేదు. కానీ, ఛానల్స్ కి పే చేయాల్సిన డబ్బుని సినిమాకు పెడుతూ పూర్తి చేసిండు.
– నాగవర్ధన్ రాయల
Very good effort. all the best Sriniwas,
very nice
Telugu repati velugu