విజయవాడలో హొటల్ ఆంజనేయ విలాస్ స్థాపకుడు.., శ్రీ వేంకటేశ్వర స్వామి వన్ టౌన్ దేవస్థాన మాజీ చైర్మన్, నటుడు, కళాపోషకుడు శ్రీ శింగం శెట్టి పెద బ్రహ్మం కనుమూశారు. ఆయన చాతీ నొప్పి కారణంగా హైద్రాబాద్ తీసుకెళ్తున్న మార్గ మధ్యంలో శుక్రవారం (9-10-20) తుదిశ్వాస విడిచారు. విజయవాడలో ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు అండగానిలిచి నిర్వహించారు. 2006 లో తుమ్మలపల్లి కళాక్షేత్రం లో శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. కళలు, ఆధ్యాత్మిక అంశాలలో ఆయన ఎక్కువ ఆసక్తి కనబరచే వారు…
అందుబాటులో వున్న ఊరిబడిలో అయిదవ తరగతి వరకూ చదివి, తండ్రికి తగిన ఆర్ధికస్థామత లేని కారణంగా ముందుకుసాగని చదువుతో కలత చెంది విజయవాడలో అప్పటికే హెటల్ నడుపుతున్న బాబాయి గారి వద్ద వంట చేయటంలో 12 ఏళ్లపాటు ప్రావీణ్యం సంపాయించి, విజయవాడ నగరం నడిబొడ్డున దుర్గమ్మ, కృష్ణమ్మల సాక్షిగా వటౌన్లో కేవలం 8 పీటలతో ఆంజనేయ విలాస్ పేరిట దాదాపు అర్ధశతాబ్దం క్రితం 1967వ సం.ములో భోజన హోటల్ ప్రారంభించి, అనుకూలవతి అయిన సతి సహాయంతో వండి, వార్చి ఓరిమితో, కూరిమితో తన హెూటల్లో భోజనం చేసే వారికి కొసరి కొసరి వడ్డించి, తల్లిదండ్రులను తలపించిన వీరి అతిథ్యమే నేటి వీరి ఉ న్నత స్థితికి అసలు కారణంగా వీరు పేర్కొంటారు.
కొందరు సచ్చు-పుచ్చు కూరగాయలు కొని తెచ్చి నాసిరకం బియ్యం, సరుకులు వాడుతూ జేబులు నింపుకునే హెటల్ వ్యాపారంలో వీరు మాత్రం కస్టమర్లకు మంచి భోజనంతో కడుపు నింపటానికే ప్రాధాన్యత ఇస్తారు. పుణ్యం పురుషార్ధాల పేరిట మన రాష్ట్రంలో అనాదిగా ఎన్నో ప్రత్యేకతలున్న ఏకైక నగరంగా విశిష్ఠత సంతరించుకున్న విజయవాడకు వచ్చిపోయే వందలాదిమంది జనం ఆంజనేయ విలాస్ ‘విలాసం’ వాకబుచేసి మరీ భోజనం చేయటమే వీరి ఆంజనేయ విలాస్ విజయవిలాసం. – పదుల వయసులోనూ రోజూ తన హెటలకు తగిన తాజా కూరగాయలు కొనటం, ఓ శివపూజలాగా భావిస్తారీయన. ఈ కార్యం తనకు శివుని ఆనతిగా తలదాల్చినానంటారు. జనం మెచ్చే భోజనం పెట్టడంలోనే తనకు ఎనలేని ఆనందం కలుగుతుందంటారు.
అక్షయపాత్రతోపాటు అక్షరయాత్ర :
తాను పుట్టిన ప్రాంతం పొదిలి తాలూకా వదిలి పెట్టి, విజయవాడలో కాలుపెట్టి పిన్ని, బాబాయిల ప్రోత్సాహంతో ఎస్.కె.పి. వి. హిందూ హైస్కూల్ మరియు ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో చదివి బి. ఎస్.నీ పట్టా పొందిన నిజజీవిత అనుభవాన్ని నెమరువేసుకుంటూ కులమతాలకతీతంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా పుస్తకాల పంపిణీ, ఆర్ధికసాయం అందిస్తూ వస్తున్నారు. తండ్రిగారు వల్లించిన భగవద్గీత శ్లోకాలను పసితనంలోనే ఒంట బట్టించుకున్న వీరికి ఈ జగమంతా శివమయంగా కనిపిస్తుంది కనుక శివదీక్షను స్వీకరించిన వీరి దినచర్య శివారాధనతోనే మొదలవుతుంది.
సాంస్కృతిక సేవ:
విద్యార్థి దశ నుండీ పద్యాలు, పాటలు పాడటం, నాటకాలలో వేషాలు వెయ్యడం వలన లలిత కళా పోషణాభిలాష వీరిలో బలంగా వుండి వీరు తమ హోటల్ బిజినెస్ లో బిజీగా వున్నాగానీ…
తన సమయం, ఆదాయంలో కొంత భాగం సామాజిక ప్రయోజనం’ కోసం వెచ్చించి అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఘంటసాల గానానికి దాసోహం అనే వీరు ఆ మంటసాల విగ్రహాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేక వ్యయప్రయాసలకోర్చి స్థాపించి ఎన్.వి. బాలసుబ్రహ్మణ్యం గారిచే ఆవిష్కరింపచేశారు. పాత శివాలయంలో సినీనటుడు బాలకృష్ణతో శివలింగాకార జ్యోతిర్లింగాల శ్లోకాలుగల పాలరాతి ఫలకాన్ని ఆవిష్కరింపచేసి అమితానంద భరితులయ్యారు.
కొంతకాలంపాటు నంగీత, నృత్య శిక్షణాలయాన్ని నడిపిన వీరు చారిత్రక, పౌరాణిక నాటకాల ప్రదర్శన, పంచాంగ శ్రవణం, పురాణ కాలక్షేపం, గీతాప్రవచనం, స్వామీజీల ప్రసంగాల వంటివి నిర్వహిస్తూ, కళల్ని, కళాకారుల్ని గౌరవిస్తూ భారతీయ లలితకళోద్ధరణకు బాధ్యత వహిస్తున్నారు.
ఋజుమార్గంలో ‘భుక్తి’ని ఆర్జించాలనే వ్యక్తిత్వం, ముక్తిమార్గంలో భక్తిని కొనసాగించాలనే ఆస్తికత్వం తనకు తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులుగా అభివర్ణిస్తుంటారీయన.
అన్నం మరువని, అన్యం ఎరుగని ఈ శంకర కింకరుడు, భోజన’ప్రియుడు నిరంతర శ్రామికుడు, నటుడు, గాయకుడు, సామాజిక సేవాపరాయణుడు, లలితకళా ప్రేమికుడు, విద్యలకు విధేయుడు.
మనోనిబ్బరంతో అష్టకష్టాలనుభవించి, అధికంగా కష్టించి అప్లైశ్వర్యాలను అనుభవిస్తూ “కట్టేవలి” అనే సూక్తికి భౌతిక సాక్ష్యంగా నిలిచిన శింగంశెట్టి పెదబ్రహ్మం అభినందనీయుడు. అక్షరాస్యత అంతంతమాత్రంగా వున్న ఆ రోజుల్లోనే పట్టభద్రులై, వేరే ఉద్యోగాల జోలికి వెళ్ళకుండా తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యంపై గల నమ్మకంతో “అన్నం పరబ్రహ్మం” అని ఎరిగిన ఈ పెదబ్రహ్మం “అన్యథా శరణం నాస్తి… అన్నం నాకు అన్నింటి కన్నా జాస్తి” అంటూ సొంత హెటల్ నడపాలన్న దృఢ నిశ్చయంతో హెటల్ స్థాపించి, తన హెటల్ కొచ్చిన పెద్ద – చిన్న కడుపారా తిని మనసారా ఆశీర్వదించబట్టే తాను హెటల్ రంగంలో 5 దశాబ్దాలుగా ఎదురైన గట్టిపోటీని తట్టుకొని నిలబడగల్గుతున్నానని సవినయంగా చెపుతారు. ఉద్యోగం పురుష లక్షణం కనుక మెతుకుల వెతుకులాటలో ఆ అన్నం మెతుకులనే నమ్ముకుని బ్రతుకు బండిని బాధ్యతగా, సజావుగా నడుపుతున్న బ్రహ్మానికి “తగినంత ఉప్పు-కారం లోపించిన వంటకం ఇసుమంతైనా మమకారంలేని మనిషి జీవితం ఎవరికీ రుచించవు” అన్నది నమ్మకం.
తన హెటల్ లో అమ్మే ‘సాదం’ (భోజనం) తాను గుళ్లల్లో అందించే ప్రసాదం ఈ రెండింటినీ త్రికరణ శుద్ధి’గా తయారుచేయించటం వీరికి ఓ దైవకార్యంగా అలవడినాయట.
పదిమందికీ పనికొచ్చే ఏ కార్యక్రమానికైనా కేవలం చందాలిచ్చేసి చేతులు దులిపేసుకోకుండా అయా కార్యక్రమాలలో సక్రియపాత్ర పోషించటంలోనే తనకు తృప్తి కలుగుతుందనే వీరు నేటి ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతన కొరవడుతున్నందున లక్షలాదిమందికి ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమంతో భక్తిభావాన్ని పెంచాలనే లక్ష్యంతో జూనియర్ ఎన్.టి.ఆర్.తో భక్తమార్కండేయ టి.వి. సీరియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రించి దానికి దేశవిదేశాలలోనూ విశేష ప్రాచుర్యం కలిగించి కృతకృత్యులైనారు. తనకున్న నటనా తృష్ణను తీర్చుకునే ప్రయత్నంలో ముఖానికి రంగుపులుముకుని రంగస్థలంపై మెరిసే బ్రహ్మం “భువన విజయం”లో కృష్ణదేవరాయపాత్రకు ప్రాణం పోశారు. ‘కోటి విద్యలూ కూటి కొరకే’ అన్న నానుడికి కట్టుబడి పదిమంది నోటికి కూటిని అందించటంలో తనకు తానే సాటిగా తాను చేస్తున్న పనిలో నిత్యం నిజాయితీని పాటిస్తూ సూటళ్ల సంఘానికి ఓ అదర్శంగా నిలిచిన పెదబ్రహ్మం హృదయం నిజమైన “అన్నపూర్ణ నిలయం”. ఆ పార్వతీపతి వరంగా లభించిన అపర అన్నపూర్ణ వంటి అర్థాంగి సుజాత సహచర్యంతో తన జన్మకు సార్ధకత ఏర్పడిందని చెప్పే పెదబ్రహ్మం ఓ ఆదర్శపతిగా కనిపిస్తారు. షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టే పెదబ్రహ్మంగారు తనకు కలిగిన ఆరుగురు సంతానం కూడా షడ్రుచుల సమాహారం అంటూ ఆనందం వెలిబుచ్చారు.
జనానికి తాను పెట్టిన భోజనం తేలికగా జీర్ణం’ అవ్వాలని అలోచించే ఈ బ్రహ్మం భక్తులు తనపై గల నమ్మకంతో కట్టపెట్టిన హెదాలో తాను బాధ్యతలు చేపట్టిన అలయాలను మాత్రం జీర్ణం కాకుండా వాటి జీర్ణోద్ధరణ కార్యాలు చేపట్టడం వీరిలోని ఓ విశేషం’. ఎంత వచించినా, రచించినా వీరి వివరాలు మాత్రం సశేషం. అదే పెదబ్రహ్మంగారి జీవితంలో దాగిన మరో విశేషం.
పెద్దమనసుతో……
తన చుట్టూ వున్న పేదసాదలను తన శక్తిమేరకు అదుకుంటూ, ఉత్సవాలలో, ఉత్పాతాలలో తన వంతు సహాయ సహకారాలందించే పెదబ్రహ్మంగారి సామాజిక సేవలను గుర్తించి కొలంబో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది.
ఈ కువలయంలో భక్తుల బాగోగులను పట్టించుకునే భోళాశంకరుని బాగోగులు పట్టించుకునే పాత శివాలయం ఛైర్మన్ పదవి తన జీవన పరమార్ధం అని తెలియజేసిన బ్రహ్మం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…
-బి.ఎం.పి. సింగ్
Sorry, it is very sad to me as he was one of my best friends and well wishers. Great personality. May his soul litting up in the presence of lord siva.