నాగార్జున సాగర్ కు చెందిన సరికొండ నరసింహరాజు రాసిన ‘ఆకలి మాట్లాడితే..’ కవిత 2020వ సంవత్సరం ఎక్స్ రే అవార్డుకు ఎంపికైనట్టు ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి తెలియజేశారు. ఈ అవార్డుకు పదివేల రూపాయల నగదుతోపాటు కవికి జ్ఞాపికతో సత్కారం వుంటుంది. యాములపల్లి నరసిరెడ్డి(అనంతపురం) రాసిన ‘అపురూపం’ కవిత, జనజ్వాల(వనపర్తి) రాసిన ‘కొద్దిసేపే మాట్లాడుకుందాం’ కవిత, కాసర లక్ష్మీసరోజారెడ్డి (జంగారెడ్డిగూడెం) రాసిన ‘కవి’ కవిత, పేరిశెట్ల శివకుమార్ (మైపాడు) రాసిన ‘మొలగొలుకు చేను’ కవిత, వైష్ణవిశ్రీ (విజయవాడ) రాసిన ‘కాలాతీతంగా ఆమె’ కవిత, ఉప్పలపు శేషునాధ్ (పి.నైనవరం) రాసిన ‘నేనూ-నా ప్రపంచం’ కవిత, దాకరపు బాబూరావు(తిరువూరు) రాసిన ‘ఆమె ఒక శిఖరం’ కవిత, చొక్కరపు తాతారావు (విశాఖపట్నం) రాసిన కవిత ‘ఇప్పుడు ఎక్కడ చూసినా మౌనమే’ కవిత, బి.వి.శివప్రసాద్ (విజయవాడ) రాసిన కవిత వెతికి పట్టుకున్న విలాసం’ కవిత, కిలపర్తి దాలినాయుడు (సాలూరు) రాసిన ‘చివరి బతుకులు’ కవిత-ఉత్తమ కవితా పురస్కారాలకు ఎంపికైనట్టు కొల్లూరి తెలిపారు. కవితల ఎంపికకు ప్రజాసాహితి ప్రధాన సంపాకులు కొత్తపల్లి రవిబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.