సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు!
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీ.ఎం. జగన్ తో పంచుకున్న కుటుంబ సభ్యులు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్ ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపిన సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు.
సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.
సీ.ఎం.ని కలిసిన సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్. శాస్త్రి.
…………………………………………………………………………………………………………
సిరివెన్నెల అభిమానులకు శుభవార్త! సిరివెన్నెల సమగ్ర సాహిత్యం పూర్తి.
పద్మశ్రీ చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి గారు రాసిన తొలి సినిమాపాట నుండి చివరిపాట వరకు సినిమా పాటలన్నింటిని 4 సంపుటాలలో సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలసి తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ముద్రించడం జరిగింది.
మొదటి సంపుటిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుగారు మే20 న హైదరాబాద్లో ఆవిష్కరించగా, రెండు, మూడు సంపుటాలను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణగారు డిసెంబర్ 11న విశాఖపట్నంలో ఆవిష్కరణ చేయగా, ఈ రోజు జనవరి 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారు నాల్గవ సంపుటాన్ని అమరావతిలో ఆవిష్కరించారు.
సిరివెన్నెల గారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రిని కలసిన ఛాయా చిత్రాలను చూడవచ్చును.
సిరివెన్నెల హార్ధిక, సరస్వతీ, సాహిత్య సంపన్నుడేగానీ, ఆర్ధిక సంపన్నుడు కాదు. ఇటువంటి పేద కుటుంబానికీ జగన్ గారు చేసిన సాయం మరువలేనిది.