“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట రాయడం మొదటిసారైనా ఆ పాట ని చాలా తక్కువ టైం లోనే రాసారంట. ఈ పాట climax ఫైట్ అప్పుడు వస్తుంది. ఒక పాట తో fight ని compose చేయడం చాలా అరుదు గా జరుగుతుంటుంది కాబట్టి. ఆ fight చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. ఈ పాట “ఎంకి పాటలు” లాగ ఒక వ్యక్తిని వర్ణిస్తూ సాగుతుంది. విజయ్ గారు తన youtube channel లో ఎంకి పాటలని, మరెన్నో అలాంటి జానపద, లలిత సంగీతాన్ని సేకరించి తాను పాడి, తన స్నేహితుల చేత పాడించి upload చేసేవారు. ఆ పాటల ప్రభావం ఈ “సిత్తరాల సిరపడు” బాగా కనిపిస్తుంది. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపద గాయకుడు బాడా సూరన్న పాడారు.

“సిత్తరాల సిరపడు” పాట లోని సాహిత్యం 

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాన ఊరి సివర సిత్తరాల సిరపడూ..
పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు.
పెత్తనాలు నడిపేడు-సిత్తరాల సిరపడు-
మంతనాలు సేసినాడు – సిత్తరాల సిరపడు
ఊరూరూ ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు.

బుగతోడి ఆంబోతు
రంకేసి కుమ్మబోతె
కొమ్ములూడదీసి మరీ
పీపలూదినాడురో……

జడలిప్పె మర్రి సెట్టు
దెయ్యాల కొంపంటే
దెయ్యం తో కయ్యానికి
తొడగొట్టి దిగాడు….

అమ్మోరి జాతరలో
ఒంటితల రావణుడు
అమ్మోరి జాతరలో
ఒంటితల రావణుడు
గుంటలెంట పడితేను.
గుద్దిగుండ చేసినాడు…
గుంటలెంట పడితేను.
గుద్దిగుండ చేసినాడు…

వరదలో గుంటగాళ్లు
సిక్కుకొని బిక్కుమంటే
వరదలో గుంటగాళ్లు
సిక్కుకొని బిక్కుమంటే
ఈతీదుకుంటుపోయి
ఈడ్చుకొచ్చినాడు రో…
ఈతీదుకుంటుపోయి
ఈడ్చుకొచ్చినాడు రో…

పొన్నూరు వస్తాదు
దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు
దమ్ముంటే రమ్మంటే
రొమ్ము మీదొక్కటిచ్చి
కుమ్మికుమ్మి పోయాడు..
రొమ్ము మీదొక్కటిచ్చి
కుమ్మికుమ్మి పోయాడు..

పదిమందినాగలేని పదిమూర్ల సొరసేపా
పదిమందినాగలేని పదిమూర్ల సొరసేపా
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు

సాముసెసే కండతోటి
దేనికైనా గట్టిపోటీ.
సాముసెసే కండతోటి
దేనికైనా గట్టిపోటీ.
అడుగడుగు యేసినాడా
అదిరేను అవతలోడు ..
అడుగడుగు యేసినాడా
అదిరేను అవతలోడు ..

సిత్తరాల సిరపడు-సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరిసివర -సిత్తరాల సిరపడు
గండుపిల్లి సూపులతో
గుండెలోన గుచ్చేడు.
గండుపిల్లి సూపులతో
గుండెలోన గుచ్చేడు.

సక్కనమ్మ ఎనుకబడ్డ
పోకిరోళ్ళనిరగదంతె
సక్కనమ్మ ఎనుకబడ్డ
పోకిరోళ్ళనిరగదంతె
సక్కనమ్మ కళ్ళల్లో
యేలయేల సుక్కలొచ్చె.
సక్కనమ్మ కళ్ళల్లో
యేలయేల సుక్కలొచ్చె..

ఈ పాటను ఇక్కడ వినండి…

SA: