చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

జాతీయస్థాయిలో గత పదమూడేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగుసాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నాము…
బహుమతులు వివరాలు-
అత్యుత్తమ కథకు రూ.2500/-
ఉత్తమ కథకు రూ.1500/-
మంచి కథకు రూ. 1000/-

ప్రత్యేక బహుమతులు రూ.500/- చొప్పున ఇద్దరికి ….
ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో రెండు నుంచి 4 పేజీలలోపు, డి.టి.పిలోనైతే 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాయాలి. ఎటువంటి ఎంట్రిఫీజులేని ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథ పుటలపై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి. కథలను ఫిబ్రవరి 28వ తేదీలోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్: 9247475975) అనే చిరునామాకు పంపాలి. విజేతలకు నగదు బహుమతులతోపాటు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ప్రత్యేక సభలో సత్కరించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap