విజయవాడలో ‘ఆన్లైన్ సింగర్స్ ‘ మీట్

సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన ‘మోహనకృష్ణ ఆర్ట్స్ ‘.

సోషల్ మీడియా ప్రవేశంతో ప్రాంతాల మధ్య దూరంతో పాటు, మనుషుల మధ్య అంతరం తగ్గి పోయింది. బ్లాగ్స్, ఫేస్బుక్, వాట్సాప్ తో పాటు ఇప్పుడు మరో కొత్త యాప్ వచ్చి చేరింది అదే  ‘ SMULE’ యాప్. ముఖ్యంగా ఔత్సాహిక గాయనీ గాయకుల కోసం రూపొందించిన యాప్ ఇది. ఇందులో సై-ఇన్  అయితే మనకు నచ్చిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన సింగర్స్ తో కలిసి డ్యూయెట్ పాడొచ్చు, ఆ వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు.

విజయవాడకు చెందిన మోహన్ కృష్ణ ఆర్ట్స్ వారు సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు.  ఈ  ‘ SMULE’ యాప్ ద్వారా పాటలు పాడుతున్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రా లకు చెందిన 30 మందిని  ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ట్రాక్ సింగర్స్ ప్రోగ్రాంను నిర్వహించారు.
మోహన్ కృష్ణ ఆర్ట్స్ కన్వీనర్ బి. ఆశయ్య ఆధ్వర్యంలో 08-12-19, ఆదివారం విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో రోజంతా జరిగిన కార్యక్రమంలో రసూల్ బాబు, వేణుగోపాలరావు, తులసీరామ్, ఆశయ్య, తులసిరాం, నాగలక్ష్మి, పద్మ, సత్యవతి, రామలక్ష్మి, వరలక్ష్మి తదితరులు కొత్త సినిమా పాటలు, లలిత గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. తొలిసారి కలుసుకున్న గాయనీ గాయకులకు ఈ ఆనంద క్షణాలు చిరకాలం గుర్తుండేలా జ్ఞాపికలు అందజేశారు నిర్వహకులు.

SA:

View Comments (2)