యూట్యూబ్లో తెలుగు తేజాలు-3
తమ ప్రతిభను, అభిరుచులను అందులో తమకున్న అనుభవాలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్ ద్వారా వారికున్న ప్రతిభాపాఠవాలను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ తద్వారా వేల నుండి లక్షలవరకు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సృజనాత్మకంగా ఆలోచించాలే కాని ఉపాధికి కాదేది అనర్హం అంటున్నారు నేటితరం. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఎవరో ఇవ్వాలి అనేవారు, కాని, నేడు తమ అభిరుచులే ఉపాధిగా వారే సృష్టించుకుంటున్నారు. టెక్నాలజీ పైన అవగాహన పెంచుకొని, అభిరుచికి సృజననల జతచేసి యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వేదికగా మార్చుకుంటున్నారు.
ఈ ఛానలో విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, వంటలు, మొక్కల పెంపకం, సంగీతం, గానం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తులతో పాటు టెక్నాలజీ, వార్తలు – విశ్లేషణలు, విహారయాత్రలు, షార్ట్ ఫిలింలు, సరదా కబుర్లు ఇలా ఒకటేమిటి సకల కళల సమాహారం యూట్యూబ్.
అతి తక్కువ ఖర్చులో, కేవలం ఒకరిద్దరు వ్యక్తులు నిర్వహించగలిగే తెలుగు ఛానల్స్ నేడు వేలాదిగా అందుబాటులో వున్నాయి. ప్రతిభ వుండాలేగానీ ఆకాశమే హద్దుగా అవకాశాలు సోషల్ మీడియాలో ఎన్నో…
య్యూటూబ్ లో తెలుగు – తేజాలు పేరుతో ఇంతకు ముందు ఆహారం-వంటలు, ఆరోగ్యం చెందిన య్యూటూబర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించిన ఛానల్స్ నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
-కళాసాగర్ యల్లపు
సమాజాన్ని మేల్కొలిపి సమాజ స్థితి గతులను చక్కదిద్దే శక్తివంతమైన మీడియా జర్నలిజం. అలాంటి వారిలో ఒకప్పుడు పత్రికలు, తర్వాత టీవీ… నేడు సోషల్ మీడియాలో యూట్యూబ్ జర్నలిస్టులు కూడా చేరారు. జర్నలిజంలో వారికున్న అనుభవంతో వ్యక్తిగత ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు, సమీక్షలు, విశ్లేషణలు అందిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
Prof Nageswar
పొలిటికల్ ఎలలిస్ట్ లలో ప్రొ. నాగేశ్వర్ గారొకరు. తెలంగాణా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిన వీరు ఒస్మానియా యూనివర్సిటీ లో జర్నలిజం పాఠాలు చెప్పి, హేన్స్ ఇండియా , HMTV లకు ఎడిటర్ గా పనిచేశారు. అనేక టీవీ ఛానల్స్ లో సమకాలీన అంశాలపై చక్కటి విశ్లేషణలు చేసే నాగేశ్వర్ గారు 2016 లో Prof Nageswar ఛానల్ ప్రారంభించారు. ఎప్పటికప్పుడు తన వీడియోల ద్వారా స్పందించే ఎ ఛానల్ కు ప్రస్తుతం 6 లక్షల 60 వేల మంది చందాదారులున్నారు. మెయిన్ స్ట్రీం మీడియా స్పుశించని అనేక ఆంశాలను వీరు చర్చిస్తారు.
Journalist Sai
టివీ9 లాంటి అనేక టివీ ఛానల్ లో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవంతో జర్నలిస్ట్ సాయి రాజకీయ విశ్లేషణలు, వార్తా విశేషాలతో ప్రారంభించిన ఛానల్ జర్నలిస్ట్ సాయి’. రోజుకి కనీసం 3 వీడియోలు అప్లోడ్ చేస్తూ, ఒక టీం వర్క్ తో నిర్వహిస్తున్న ఛానల్ ఇది. ప్రస్తుతం ఈ ఛానల్ కు 6 లక్షల 30 వేలు చందాదారులున్నారు.
Nationalist Hub
సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ దేశం… మనసా వాచా కర్మణా… అంటూ ప్రారంభించిన ఈ నేషనలిస్ట్ హబ్ ఛానల్ దేశంలో నున్న అనేక సమష్యల గురించి, ముఖ్యంగా సమకాలీన సమష్యలపై సమగ్రమైన వాదనలు-ప్రతిపాదనలు చేస్తూ… దేశ సమగ్రతకుపయోగపడే చక్కటి విశ్లేషణలు అందించే మంచి ఛానల్ ఇది. ఇందులో ‘అన్సుంగ్ హీరోస్ ‘ పేరుతో ఒక ఫీచర్ ను నిర్వహిస్తూ హిందూమత రక్షణకు కంకణం కట్టుకున్న అనేక మంది యోధుల గురించి స్పూర్తిదాయకమైన కథనాలు రూపొందిస్తున్నారు. జాతీయవాద దృక్పదాన్ని నేటి యువతలో నింపే విధంగా, భాతతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో వీడియోలు అందిస్తున్నారు.
Journalist Diary
జర్నలిస్ట్ గా అటు ప్రింట్ మీడియాలోనూ – ఇటు ఎలట్రానిక్ మీడియాలోనూ మూడు దశాబ్దాల అనుభవమున్న సతీష్ బాబు ‘జర్నలిస్ట్ డైరీ ‘ పేరుతో 2016 లో ఛానల్ ప్రారంభించారు. 2 లక్షల 30 వేల చందాదారులతో ఆశక్తికరమైన కథనాలతో, విశ్లేషణలతో, ప్రముఖుల ఇంటర్వ్యూలతో నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నారు సతీష్ బాబు.
Telugu Box Office TV
ఛానల్ పేరు చూసి ఇదేదో సినిమా వార్తలకు సంబంధించినది అనుకుంటాం, కాని ఈ ఛానల్ లో సినిమా, రాజకీయ విశ్లేషణలు, చారిత్రక విశేషాలు, పురాణ ఇతిహాసాలు, జాతీయ, అంతర్జాతీయ విశ్లేషాత్మక కథనాలు ప్రేం చాలా ఆశక్తికరంగా వివరిస్తారు. బీనాదాస్, రతన్ టాటా, రజనీకాంత్ ల గురించి చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 2016 లో ప్రారంభించిన ఛానల్కు 5 లక్షల 90 వేల మంది చందాదారులున్నారు.
Kundabaddalu
కొంతకాలం సినిమా జర్నలిస్ట్ గా పనిచేసిన కాటా సుబ్బారావు కు జర్నలిజం లో మంచి ప్రావీన్యం వుంది. సమకాలీన రాజకీయాలు, సమస్యలు, సినిమాలు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం వీరి ప్రత్యేకత. అందుకే వీరి యూట్యూబ్ ఛానల్ ఛానల్ కు ‘కుండ బద్దలు ‘పేరు పెట్టారు. పశ్చిమ గొదావరి జిల్లాకు చెందిన కాటా సుబ్బా రావు గారికి వీడియోలను వీరి అబ్బాయి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఛానల్ కు ప్రస్తుతం 2 లక్షల 31 వేల మంది చందాదారులున్నారు.
Telakapalli Media
పొలిటికల్ జర్నలిస్ట్ గా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ విశ్లేషకునిగా, రచయితగా సుపరిచితులైన తెలకపల్లి రవి 2018 లో ‘తెలకపల్లి మీడియా’ పేరుతో ఛానల్ ప్రారంభించారు . ప్రస్తుతం వీరి ఛానల్ కు 56 వేల చందాదారులున్నారు.
మంచి సమాచారం
Teenmar Mallanna kanapadaledaa meeku
Teenmar Mallanna present BJP leader kada….