సోనీ సూపర్ స్టార్ సింగర్ విన్నర్ – ఆవిర్భవ్

కేరళ నుండి వెళ్ళాడు.. ముంబయి నగరంలో గెలిచాడు…
పేరు ఆవిర్భవ్.. మలయాళీ పిల్లాడు.. వయసు ఏడేళ్ళు… బాల గంధర్వుడనే అనాలి. అంత తక్కువ వయసులో సంగీతాన్ని నేర్చుకొని క్యూట్ క్యూట్ గొంతులతో అమాయకమైన ఫేసులతో వాడు పాడుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది.. రిలాక్స్ గా ఫీల్ ఉంటుంది.. Sony liv అనే హిందీ పాపులర్ టీవీ ఛానెల్ లో Superstar Singer అనే కార్యక్రమం రెగ్యులర్ ప్రసారం అవుతుంటుంది… అందులో ఆవిర్భవ్ పర్ఫామెన్స్ అదిరిపోతుంటుంది… వీడి పాత వీడియోలన్నీ మళ్లీ మళ్లీ చూస్తుంటే… మాటల్లో చెప్పలేని ప్రేమ/ అభిమానం ఉప్పొంగుతుంది వాడి పర్ఫామెన్స్ చూస్తే..

ఎందుకు ఆవిర్భవ్ అంటే అంత స్పెషాలిటీ అంటే..!
వయసు ఏడేళ్లు, ఇంగ్లీష్ అంతగా రాదు, హిందీ అనేది కొత్త. పక్కా సౌత్ మలయాళీ కుర్రోడు.. అలాంటివాడు ఎందరో హిందీ సంగీత ఘణాపాటీలకు చమటలు పట్టించాడు..
తనకు భాష రాదని ఏమాత్రం జంక లేదు.. ఎదుట ఎంత పెద్ద కళాకారులున్న.. ప్రేమగా చిరునవ్వుతో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు..
ఆ బుడతడులో భయం కనపడదు.. ఓ మాటలో చెప్పాలంటే ఈ తరం పిల్లలకి ఈ చిన్నోడు ఒక ఇన్స్పిరేషన్..!
మనోడి అక్క ఉంది.. పేరు అనిర్వీణ్య.. ఇప్పుడు టీనేజ్ లో ఉంది.. ఆవిడ జానకి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, జిక్కి, సుశిలా, లతా మంగేష్కర్, చిత్ర, ఇలాంటి వాళ్లని మిక్సీలో వేసి తీసినట్టు పెర్ఫామ్ చేస్తుంది…
ఇక ఆవిర్బవ్ విషయానికొస్తే #superstarsinger2024 లో ఫైనల్స్ లో గెలిచాడు.

అవార్డు కూడా..:
అవిర్భవ్ మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు ఆ షోలో ఉన్నవాళ్లంతా హాయిగా నవ్వుకున్నారు. అవిర్భవ్ ‘సరిగమప’లో కంటెస్టెంట్ కాకపోయి నా.. పిల్లోడి టాలెంట్ వల్ల అప్పుడప్పుడు పాటలు పాడే అవకాశం దక్కింది. ‘సరిగమప లిటిల్ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాలే’ టైంలో అవిర్బవ్ ‘నాని’ సినిమాలోని ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’ పాట పాడాడు. అప్పుడు అక్కడున్న జడ్జిలు అంతా మెచ్చుకున్నారు. ‘భగవంతుడు లాలిపాట పాడితే ఇలా ఉంటుందేమో’ అంటూ పొగిడారు. అంతేకాదు.. రెండేండ్ల వయసులోనే ‘సరిగమప’లో బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. అయితే.. అప్పుడు తెలుగువాళ్ల ను అలరించిన ఈ బుడతడు ఇప్పుడు సోనీ ఎంట ర్టైన్మెంట్ టెలివిజన్లో వస్తున్న ‘సూపర్ స్టార్ సింగర్-3’లో పాడి దేశవిదేశాల్లో ఉన్న సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాడు. మరో ప్రత్యేకత ఏంటంటే.. రెండేండ్ల వయసులో సరిగమపలో పాడేంతవరకు ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. అక్క అనిర్విణ్య గురువుగా నేర్పిన పాటలే పాడాడు. అక్క పాడుతుంటే ఆమె ఒళ్లో కూర్చొని ఎనిమిది నెలల వయసు నుంచే సరిగమప అంటూ సంగీతాన్ని పలకడం మొదలుపెట్టాడు. అంటే.. అక్కే అతనికి మొదటి గురువు. వాళ్లిద్దరూ కలిసి పాటలు పాడుతూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అవి వైరల్ అవుతుంటాయి. చిన్న పిల్లలు పలకలేని చాలా పదాలను చాలా ఈజీగా పలుకుతాడు అవిర్భవ్.

మెచ్చుకున్న ఉదిత్ :

ఈ మధ్య ఒకసారి సూపర్ స్టార్ సింగర్-3 షోకి స్పెషల్ గెస్టుగా మెలోడీ కింగ్ ఉదిత్ నారాయణ్, అతని భార్య దీపా నారాయణ్ వచ్చారు. ఆ స్పెషల్ ఎపిసోడికి ‘ఉదిత్ నారాయణ్ మాస్టర్ క్లాస్’ అని పెట్టారు. అందులో ఆయన పాడిన పాటలను కంటెస్టెంట్లతో పాడించి ఉదిత్కి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో కూడా ఏడేండ్ల అవిర్బవ్ హైలైట్గా నిలిచాడు. “హమ్ దిల్ దే చుకే సనమ్” సినిమాలోని “చాంద్ చుపా బాదల్ మే” అనే పాట పాడాడు. అవిర్భవ్ పాడే విధానం చూసి, అతని గొంతు విని అందరూ ఆశ్చర్యపోయారు. “ఇంత చిన్న వయసులో అవిర్భవ్ చాలా బాగా పాడాడు. ఇంత ఎమోషన్తో ఈ పాట పాడడానికి నాకు చాలా ఏండ్లు పట్టింది. చాలా ఫీల్తో పాట పాడావు” అంటూ ఉదిత్ నారాయణ్ అవిర్భవ్ సింగింగ్ స్టయిల్ని మెచ్చుకున్నాడు. దీపా నారాయణ్ అయితే “నాకు మాటలు రావడం లేదు. నువ్వు చాలా అందంగా పాడావు. ఉదితే కంటే కూడా బాగా పాడావు”అంటూ మెచ్చుకుంది. ఇక జడ్జి నేహా కక్కర్ “అవిర్బవ్ ఏడేళ్ల వయస్సులోనే అద్భుతమైన ఎమోషన్, ఎక్స్ప్రెషన్, పాటని ఒక్కచోట చేర్చావు. ఏడేండ్ల పిల్లాడు ఇదంతా చేశాడనే నిజాన్ని నమ్మడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఏడు అద్భుతాలు ఉన్నాయి. కానీ అవిర్భవ్ ఎనిమిదో అద్భుతం” అంటూ పొగిడింది. ఏడేండ్లకే ఇంతగా పాడుతున్నాడని ఆశ్చర్యపోని మనిషి లేరంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతంలో అవిర్భవ్ హెయిర్ స్టయిల్ కూడా ట్రెండింగ్ అవుతోంది. ఆ విషయాన్ని ఒక షోలో వీడియో వేసి మరీ చూపించారు.

అక్క(అనిర్విణ్య) తమ్ముడు (అవిర్భవ్) తో కలిసి నిర్వహిస్తున్న Anirvinhya & Avirbhav యూట్యూబ్ ఛానల్ కు ఎనిమిది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ వున్నారు.
ఈ బుడతడి పాటలు ఇక్కడ వినవచ్చు: https://www.youtube.com/watch?v=siXR5d6t9kk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap