క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, పోర్ట్రైట్ వర్క్ షాప్
సీనియర్ చిత్రకారులకు, చిత్రకారిణిలకు గౌరవ పురస్కారాల ప్రదానం
…………………………………………………………………………………
క్రియేటివ్ హార్ట్స్ (Creative Hearts) అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ , నిర్వహించిన “SPECTACLES” The Art Show కార్యక్రమాలు రాజమండ్రి, హోటల్ అనుపమ ఫంక్షన్ హాల్లో ఆదివారం అనగా జూన్ 2, 2024 తేదీన ఆద్యంతం ఆకర్షణీయంగా నిర్వహించారు. ప్రముఖ చిత్రకారుల మరియు క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్- సంస్థ 25 మంది విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిత్రకళా ప్రదర్శనలో రెండు తెలుగు రాష్ట్రాల చిత్రకారులు పాల్గొన్నారు.
ప్రముఖ యువ చిత్రకారులు రాజు కండిపల్లి, మహేష్ కట్టా, వీరు పెండ్యాల గార్ల లైవ్ పోర్ట్రైట్ వర్క్ షాప్ (LIVE Portraits DEMO) షాప్ ను 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ యల్లపు ఉదయం ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ చైర్మేన్ శ్రీ టి.కె. విశ్వేశ్వర రెడ్డి గారు చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన ప్రముఖ నఖ చిత్రకారులు శ్రీ రవి పరస గారు చేసారు. ఈ చిత్రకళ ప్రదర్శనకు వేదికను సమకూర్చిన అనుపమ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ Y. త్రినాథ్ మూర్తి గారు అతిథిగా పాల్గొన్నారు.
మధ్యాహ్నం జరిగిన ముగింపు సభలో సీనియర్ చిత్రకారులకు, ప్రముఖ చిత్రకారులకు గౌరవ పురస్కార ప్రదాన సత్కారం, విద్యార్థి చిత్రకారులకు ప్రోత్సాహక పురస్కార ప్రదానం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ చిత్రకారులు శ్రీ పి.ఎస్ ఆచారి, శ్రీ కరణం నూకరాజు , శ్రీమతి పట్నాల రాధారాణి , శ్రీమతి ఎన్.వి.పి.ఎస్ ఎస్.లక్ష్మి, శ్రీ ఎన్.ఎస్. శర్మ, శ్రీ పసుపులేటి గణేష్, శ్రీ గంటా దుర్గారావు గార్లను గౌరవ పురస్కారంతో అతిథుల చేతులమీదుగా ఘనంగా సత్కరించారు.
అనంతరం లైవ్ పోర్ట్రైట్ వర్క్ షాప్ (LIVE Portraits DEMO) లో పాల్గొని విజయవంతం చేసిన చిత్రకారులు రాజు కండిపల్లి, మహేష్ కట్టా, వీరు పెండ్యాల గార్లను సత్కరించారు.
2015 లో క్రియేటివ్ హార్ట్స్ (Creative Hearts) అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రారంభించి ఏడాదికి రెండు, మూడు సార్లు చొప్పున నిర్వహిస్తున్న చిత్రకళా కార్యక్రమాలు శ్రీయుత ఆకొండి అంజి గారి కళాభిమానానికి తార్కాణాలు. చిత్రకళా ప్రదర్శనలు, వర్క్ షాప్ లు లాంటి కార్యక్రమాలను ఎంతో వ్యయప్రయాసలతో నిస్వార్థంగా నిర్వహిస్తున్న అంజి గారి కళాసేవ అభినందనీయం.
–ఎన్.వి.పి.ఎస్ ఎస్.లక్ష్మి
చాలా చాలా ధన్యవాదములు సర్..
క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, కార్యశాల,
ప్రముఖ చిత్రకారులకు, చిత్రకారిణిలకు సత్కారాలు జరగటం ఆనందదాయకం. సమర్ధవతంగా నిర్వహించిన అంజి ఆకొండి గారి కళాసేవ అభినందనీయం.