“స్ఫూర్తి” శ్రీనివాస్ కి సాంస్కృతిక సేవా పురస్కారం

‘కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ’ జాతీయ సాహిత్య పురస్కారాల ప్రదానం

చిత్రకళకి పునరుజ్జీవనం కలిగించి…చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి…కళని, కళా సంస్కృతి ని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో గత ఇరవై సంవత్సరాలుగా “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో చిత్రకళలో ఎన్నో వేల మంది చిన్నారులకు శిక్షణ నిస్తూ సమాజానికి కొంతమంది ఉత్తమ చిత్రకారులను అందిస్తూ…చిత్రకళ ద్వారా పలు సామాజిక అంశాలపై చైతన్యాన్ని తీసుకురావాలనే దీక్షతో… “సేవ్ స్పారో”, “ఆర్ట్ బీట్”, “టాలెంట్ హంట్”, “సలాం ఇండియా”, “సేవ్ గర్ల్ చైల్డ్”, “సేవ్ నేచర్ ఫర్ ఫ్యూచర్” వంటి టైటిల్స్ తో చిత్రలేఖనం పోటీలు, చిత్రకళా ప్రదర్శనలు నిర్వహిస్తూ… సీనియర్ చిత్రకారులకి, యువ చిత్రకారులకి, చిన్నారి చిత్రకారులకి పలు అవార్డులు ఇస్తూ తనవంతు బాధ్యతగా కళకు స్ఫూర్తి శ్రీనివాస్ చేస్తున్న కృషిని గుర్తించి కడపకు చెందిన కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ వారు ఆదివారం (4-12-2022) విజయవాడలో నిర్వహించిన జాతీయ సాహిత్య పురస్కారాలలో భాగంగా చిత్రకళా రంగానికి గానూ సాంస్కృతిక, సేవా పురస్కారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి వాసిరెడ్డి పద్మ, మహిళా చైర్ పర్సన్ గారి చేతుల మీదుగా అందించి ఘనంగా సత్కరించారు.

అలవర్తి పిచ్చయ్య చౌదరి, బోయపాటి దుర్గాకుమారిగారి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తూములూరి రాజేంద్ర ప్రసాద్ ఇంకా ప్రముఖ కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు, చిత్రకారులు పాల్గొన్నారు.

-కళాసాగర్

SA:

View Comments (1)