పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం దొడ్డేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 పదోవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం(17-10-21) ఆనందోత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించుకునేందుకు 34 ఏళ్ళ తరువాత పూర్వవిద్యార్థులు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ డ్రాయింగ్ మాష్టారు గన్నే నాగ వాసుదేవరావుగారు గీసిన బొమ్మలను, చెప్పిన నీతి కథలను గుర్తుచేసుకుని ఆనందించారు. వాసుదేవరావుగారు రేఖా చాత్రాలను గీయటంలో దిట్ట. వీరి ప్రతిభను గుర్తించిన క్రియేటివ్ అబాకస్ గుంటూరు వారు “రేఖా సౌగంధిక” పురస్కారంతో సత్కరించారు.
ఉత్తమ గురువుగా “నేషన్ బిల్డ్” రోటరీక్లబ్ వారిచే సన్మానమందుకున్నారు. బోధించటంలో గురువులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలిలో ఉంటుంది. ఈయన పిల్లలకు నల్లబల్ల మీద చిత్రాన్ని గీసి ఆచిత్రానికి సంబందించిన కథ చెబుతూ ఆకథలో ఒక సన్నివేశాన్ని చూపిస్తారు. ఎన్నో రేఖాచిత్రాలను అలాగే గీస్తారు. పిల్లలతో మీకు నచ్చిన ఏదో ఒక గీత గీయమంటారు ఆగీతను చెరపకుండా రేఖలను జోడించి చిత్రాన్ని పూర్తిచేసి ఆశ్చర్యపరుస్తారు.

పిల్లలు కేరింతలతో ఆనందం వ్యక్తపరుస్తారు. అంతేకాక నాటికలు రచించారు. గుంటూరు జిల్లా స్థాయి ప్రదర్శనలో ‘బేటీ పడావో బేటీబచావో’ అనే అంశంలో ‘అమ్మా పెళ్ళంటే ఏమిటి!’ అనే నాటిక జిల్లా ప్రథమస్థానం పొందినది. డ్రాయిగ్ మాష్టారుగా దొడ్డేరు, ఏటుకూరు, అచ్చంపేట, యనమదలలో పనిచేస్తూ ఉద్యోగ విరచణ పొందారు. విరమణ అనంతరం షార్టుఫిలింమ్స్ తీస్తున్నారు. ఈ విషయాలన్ని గురువులు విద్యార్థులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రామకోటి రెడ్డి, జె. శ్రీరామమూర్తి, జి. వెంకటేశ్వర్లు, జి. యన్ వాసుదేవరావు, యస్. డి. నాగుల్ మీర గారు పూర్వ విద్యార్థులు ఎపి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాష, ప్రసాద్, నరసరాజు, లేవిబాబు, ఆంకాళ్ళ నరసింహారావు, కట్టమూరి శ్రీనివాస్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

-మల్లిఖార్జునాచారి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link