ఇటీవల శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, తిరుపతి వారు జాతీయ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఆగస్ట్ 22 న ఫలితాలు ప్రకటించారు.
భారతదేశాన్ని కాక యావత్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కరోనా ప్రభావంతో ఇళ్ళకే పరిమితం అయిన పిల్లలను చిత్రకళ వైపుకు మరల్చాలనే సదుద్దేషంతో విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీకళాక్షేత్ర వారు.
నాలుగు భాగాలుగా జరిగిన ఈ పోటీలను జాతీయ పండుగలు, స్వచభారత్, కరోనా అంశాలపై నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో 4700 మంది పాల్గొన్న విద్యార్థులనుండి నుండి 32 మందిని సర్వోత్తమ పురస్కారానికి (నగదు బహుమతి), 208 మందిని ఉత్తమ పురస్కారానికి (మెరిట్ సర్టిఫికెట్స్) ఎంపిక చేసారు. నగదు బహుమతుల విలువ 40 వేల రూపాయలు.
దాదాపు భారతదేశం లో ప్రతి రాష్ట్రం నుండి విద్యార్థులు పాల్గొనడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ పోటీలకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకపోవడం హర్షనీయం. ఈ మధ్య ఆన్లైన్ లో అనేక పోటీలు జరుగుతున్నప్పటికీ ఆయా సంస్థలు కేవలం సర్టిఫికేట్ నే బహుమతులుగా ప్రకటిస్తున్నారు. కాని శ్రీకళాక్షేత్ర 40 వేల రూపాయలు నగదును బహుమతుల రూపంలో అందించడం అభినందించదగ్గది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన న్యాయనిర్ణేతలకు, చిత్రకారులకు, విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు శ్రీకళాక్షేత్ర జనరల్ సెక్రటరి జి.వి.సాగర్ కృతజ్ఞతలు తెలియజేసారు.