శ్రీకృష్ణ లీలలు చిత్రకళా ప్రదర్శన

కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడలో గ్రూప్ షో.

భూ మాత యావత్ ప్రజానీకానికి పుణ్యమాత. భూమాతపై అరాచకాలు, హత్యాచారాలు, అత్యాచారాలు పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో అవతరించి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని, న్యాయాన్ని పునరుద్ధరిస్తాడని పురాణాల ద్వారా తెలుసుకొంటాము. ఇది భారతీయ సంస్కృతికి ఒక నిదర్శనం. ఈ రూపావతారాలనే దశావతారాలుగా మనం గుర్తిస్తాము. దశావతారాలలో ద్వాపరయుగంలోనిది కృష్ణావతారం.

శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా దేవకీ వసుదేవుల 8వ సంతానంగా కారాగారంలో జన్మించినప్పటికి అనూహ్య పరిస్థితులలో గోకులంలో యశోదమ్మ ముద్దుబిడ్డగా పెరుగుతూ అనేక ఆనందదాయకమైన, ఆశ్చర్యకరమైన విన్యాసాలతో ధర్మసంరక్షణార్థం అనేక సత్కార్యాలు చేసినట్లు తెలుసుకొంటాము. గోపబాలుర ప్రియమైన స్నేహితునిగా వారిని ఆనందడోలికలలో ముంచిలేపుతూ వేలాది గోపికల ఆరాధ్య దైవంగా, ప్రేమమూర్తిగా రస భరితమైన చర్యలతో ధర్మపరిరక్షణకు రాక్షస సంహారం చేసినట్లు మనం తెలుసుకొంటాము. ఈ విషయాలనే “కృష్ణలీలలు”గా మనం అనేక మంది రచయితల ద్వారా తెల్సుకోగలిగాం.

ఇలాంటి శ్రీకృష్ణ లీలలను తన కళాత్మక వర్ణ చిత్రం ద్వారా యావద్బారతావనికి మొదటిగా చూపించింది రాజా రవి వర్మ.ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ అమరావతి, విజయవాడలో శుక్రవారం ఆర్ట్ అసో సియేషన్స్ గిల్డ్, భాషా, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర కళా ప్రదర్శన నిర్వహించారు.


మన రాష్ట్రం నలుమూలల నుండి 44 మంది చిత్రకారులు రూపొందించిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేసారు. ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులందరు తమ అభిరుచికి అనుగుణంగా వివిధ శైలిలలో అనేక ప్రక్రియలలో చక్కని కళానైపుణ్యంతో తమ చిత్రాలను అందించారు. కొన్ని ప్రాచీన రీతిలోను, కొన్ని జానపదరీతిలోను, కొన్ని ఆధునిక రీతిలోను చిత్రించబడి జనరంజకంగాను, ఆకర్షణీయం గాను వున్నవి. ఈ చిత్రాలన్నిటి కలయికే ఈ ప్రదర్శన, అయితే ఇంత చక్కటి ప్రదర్శన మరో రోజు కొనసాగితే కళాప్రేమికులందరు చూసి ఆనందించగలిగేవారు.

తమ కిష్టమైన కళలో రాణిస్తే మిగిలిన రంగాల్లోనూ అదే స్పూర్తితో ముందు కెత్లారని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎ. లక్ష్మీకుమారి అన్నారు. లక్ష్మీ కుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యాబుద్ధులు విజ్ఞానాన్ని, కొలువులను సాధించడానికి ఉపకరిస్తే కళలు మానసిక వికాసానికి, – సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. యువ చిత్రకారులను ప్రోత్సహించి చిత్ర కళ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. వైకాపా వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఏదో ఒక కళ పై ఆసక్తి కనబరచాలని పేర్కొన్నారు. 44 మంది చిత్ర కళాకారులు శ్రీకృష్ణుని లీలలను ప్రతిబింబించేలా చేసిన వర్ణ చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ అధ్యక్షుడు డాక్టర్ డా. బి.ఏ. రెడ్డి,అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్. ఎస్. ఆర్కే ప్రసాద్, లయన్ 316డీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వైసీపీ ప్రసాద్,గోళ్ళ నారాయణరావు, రాఖీ, డ్రీం రమేష్ పాల్గొన్నారు.

ఈ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులు సర్వశ్రీ బి.యన్.రెడ్డి, జింకా రామారావు, ఆర్. సుభాష్ బాబు, పి.ఎస్. ఆచారి, కె.ఎస్. వాస్, పి. రాధారాణి, సి. కోటేష్, కే.ఏ. రాజు, కొండా శ్రీనివాస్, గూడూరి, ఎం. సరస్వతి, కిరణ్ తాడోజు, ఎల్. సౌజన్య, ఎన్.వి.పి.ఎస్ లక్ష్మి, శ్యామ్ సుందర్, అమీర్జాన్, రాఖీ, ఎన్.ఎస్. శర్మ, రాజు బత్తుల, కె. శ్రీనివాస్ , మన్చెం సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె. గాంధీ, పద్మారెడ్డి, బాపిరాజు, ఎం. ప్రసాద్, లోకేష్ రెడ్డి, ఎన్.ఆర్. కుమార్, టి. రవీంద్ర, టి. సునీత, పి. సృజన్, అరసవిల్లి గిరిధర్, మంజుల రాణి, కె. రామచంద్రయ్య, శాస్త్రి, వెంపటాపు, అన్నపూర్ణ, జి. జయన్న, బి. సూర్యనారాయణ, జి. మధు, పార్థసారధి, జి. రవిశాస్త్రి, దామోదర్ రెడ్డి, డి.కృష్ణమాచారి.

4 thoughts on “శ్రీకృష్ణ లీలలు చిత్రకళా ప్రదర్శన

  1. 💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺”విశ్వరూప సందర్శనం “పెయింటింగ్ తో ఈ గ్రూప్ షో లో పాల్గొనడం నా అదృష్టం 🌺 ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ AP వారికి ధన్యవాదాలు 🌺

  2. “విశ్వరూప సందర్శనం “పెయింటింగ్ తో ఈ షో లో పాల్గొనడం నా అదృష్టం ART Associations GUIELD AP వారికి ధన్యవాదాలు 💐🌺💐-VEMPATAAPU

  3. 💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺”విశ్వరూప సందర్శనం “పెయింటింగ్ తో ఈ గ్రూప్ షో లో పాల్గొనడం నా అదృష్టం 🌺 ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ AP వారికి ధన్యవాదాలు 🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap