(6 రోజులపాటు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు శ్రీకాంత్ బాబు ఆర్ట్ ఎగ్జిబిషన్)
కళాత్మక హృదయాలు కలిగిన చిత్రకారులు తమ ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి చిత్రాన్ని గీస్తే అది ఒక అద్భుతమే అవుతుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీకాంత్ బాబు చేతిలో రూపొందిన క కళాకృతుల ప్రదర్శన మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో కొలువుదీరింది. అలేఖ్య హోమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాకృతుల ఎగ్జిబిషన్ ను ప్రముఖ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ ఆర్.పి. పట్నాయక్ మరియు డాక్టర్ కే. లక్ష్మీ IAS కలిసి ఆదివారం (25-9-22) నాడు ప్రారంభించారు.
ప్రముఖ చిత్రకారులు శ్రీకాంత్ బాబు అడెపు కుంచెతో వేసిన 12,000 రకాలైన ఆకృతులు ది వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీకాంత్ బాబు అడెపు గీసిన మైథాలోగ్ చిత్రాలు ఈ ప్రదర్శనలో చూపరులను కట్టిపడేస్తున్నాయి. గ్రామీణ వాతావరణంలోని సహజశైలి, దశావతారం, స్త్రీల సహజ సిద్ధమైన అందాలు, విష్ణు మూర్తి, బ్రహ్మ, శివుడు, గణేశుడు లాంటి వేలాది చిత్రాలు, స్కెచ్ లు కళాభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ప్రదర్శన ఈ నెల 30 వ తేదీ వరకు కొనసాగుతుంది.
-కళాసాగర్