విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 16
అగణిత ప్రతిభగల భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ తమిళనాట నిరు పేద కుటుంబంలో జన్మించి, 12వ యేటనే తన అసాధారణ గణిత ప్రతిభను ప్రదర్శించి, పలువురి దృష్టిని ఆకర్షించాడు. రామానుజన్ ఇంగ్లండులో వుండగా, కాంపోజిట్ సంఖ్యల పై చేసిన పరిశోధనలకుగాను పిహెచ్.డి. అందుకున్నాడు. తన పరిశోధనా పత్రాన్ని జర్నల్ ఆఫ్ ద లండన్ మేథమెటికల్ సొసైటీ లో ప్రచురించాడు. 1918 వ సం.లో కేంబ్రిడ్జ్ ఫెలో ఆఫ్ ట్రిసిటీ కాలేజికి ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయుడు రామనుజన్. తాను మరణశయ్యపై వుండి కూడా తనను పరామర్శించడానికి వచ్చిన హార్డి కారు నెం. 1729 = 1 + 12 = 9 + 10. అతని అత్యల్ప 32 యేండ్ల జీవిత కాలంలో అత్యధికమైనటు వంటి 3900 గణిత ఫలితాలను వెలువరించాడు. రామానుజన్ గౌరవార్థం తమిళనాట ఈయన పుట్టిన రోజున రాష్ట్ర ఐ.టి. దినంగా పరిగణిస్తున్నారు. రామానుజన్ పేరిట ఓ స్టాంపును కూడా విడుదలచేసి భారతదేశం ఈయనను గౌరవించింది. ఈయన గౌరవార్థం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థ్రిటికల్ ఫిజిక్స్ పేరిట అభివృద్ధి చెందిన దేశాలు ఓ అవార్డును ప్రకటించాయి. ఈ భారతీయ గణితశాస్త్ర రత్న శ్రీనివాస రామానుజన్ నేటికీ మన ధృవతార!
(శ్రీనివాస రామానుజన్ జన్మదినం 22 డిశంబర్ 1887)