సృష్టి ఆర్ట్ అకాడమి వారి చిత్రకారుల వెబ్సైట్ ను ప్రారంభించిన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు.
సృష్టి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో చిత్రకారుల వివరాలు, వారి పెయింటింగ్స్, వారు సాధించిన వివరాలు, ఆర్ట్ న్యూస్, చిత్రకళకు సంబంధించిన వెబ్సైటు www.unitedculturalforum.com ను మన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఏ.పి. రాష్ట్ర సచివాలయం, అమరావతి లోప్రారంభించారు. సృష్టి ఆర్ట్ అకాడమి గత 24 సంవత్సరాలుగా పెయింటింగ్ లో ప్రపంచ రికార్డులు, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి వారు చేస్తున్న చిత్రకళా ప్రదర్శనలు, పోటీలు వారి కార్యక్రమాలను అభినందించి, నేషనల్ చిల్డ్రన్స్ పెయింటింగ్ పోటీల బ్రోచర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా సృష్టి కల్చరల్ సొసైటీ అధ్యక్షులు డా. తిమ్మిరి రవీంద్ర, నేషనల్ హ్యూమన్ రైట్స్ & జాయింట్ యాక్షన్ కమిటి జాతీయ కార్యదర్శి డా. టి. భానుచందర్ గారు, అమీర్ ఆర్ట్ అకాడమి అధ్యక్షులు డా. షేక్ అమీర్ జాన్ పాల్గొన్నారు.
