సృష్టి ఆర్ట్ అకాడమీకి సంగీత కళాకేంద్ర గుర్తింపు…

ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీకి సూరో భారతి సంగీత కళాకేంద్ర వారి గుర్తింపు…

మన ఒంగోలు కి చెందిన సృష్టి ఆర్ట్ అకాడమీ గత 19సంవత్సరాలుగా ఎంతోమంది చిత్రకారులను తయారు చేసి, పెయింటింగ్ లో ప్రపంచ రికార్డులను సాధించినందుకు వెస్ట్ బెంగాల్, హుబ్లీ కి చెందిన సూరో భారతి సంగీత కళాకేంద్ర https://www.sskalakendra.org/ వారి ఆఫ్ఫ్లియేషన్ సర్టిఫికెట్, అనుబంధ ప్రశంసాపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్య కళల అకాడమీ చైర్మన్ శ్రీమతి గుడిపూడి సత్య శైలజ భరత్ గారి చేతుల మీదుగా తిమ్మిరి రవీంద్రకు అందచేసి అభినందించారు. ఈ సందర్భముగా సత్య శైలజ గారిని అమలాపురంలో వారి గృహంలోనే సాలువాతో సత్కరించి సృష్టి ఆర్ట్ అకాడమీ షిల్డ్ ను అందచేశారు. ఈ సందర్భముగా చిత్రకారులకు మేము ఎటువంటి సహాయం చేయడానికయినా సిద్దమని ఆమె తెలిపారు. ఈ సందర్భముగా తిమ్మిరి రవీంద్రను చిత్రకారుడు వై. యస్. బ్రహ్మం, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి టి. భానుచందర్, సింగమనేని సురేష్, తునుగుంట నాగమణి, బత్తుల మంజు వాణి, చెరువు శ్రీలక్ష్మి, డైమండ్ 9 మేనేజింగ్ పార్టనర్ డి. బి. కోటేశ్వరరావు, టి. శిరీష, అద్దంకి అంజలీ, తునుగుంట హేమంత్, మరియు ఇంకా పలువురు చిత్రకారులు, సాహితి సంస్థలు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link