రాష్ట్ర కథారచయితల సమావేశం జూన్ 9న, ఆదివారం 2024 కాకినాడలో…
తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం 20 సంవత్సరాల నుండి సాహిత్య కృషి చేస్తోంది. జిల్లా రచయితల సంఘ సమావేశాలు 3, 4 సార్లు జరిపించడమే కాక యువ కవుల వర్క్ షాపులు, జిల్లాస్థాయి కవిసమ్మేళనాలు తరచూ నిర్వహిస్తుంది.
కథలు-అలలు అనే కథా సంకలనాన్ని 2011 సంవత్సరంలో తీసుకొచ్చింది. ప్రముఖుల సమక్షంలో, ప్రసిద్ధుల సారధ్యంలో తూర్పుగోదావరి జిల్లా సాహిత్య చరిత్ర అను 316 పేజీల ఒక సమగ్ర అధ్యయన గ్రంధం 2018 లో ప్రచురించింది. శ్రీ పి.వి. నరసింహారావు గారి కథ గొల్ల రామవ్వ మీద అభిప్రాయాల మాలిక 2021 లో వెలువరించింది. అనుభవము, అధ్యయనము, నిర్మాణ ఉత్సాహము కలిగిన సభ్యులతో జిల్లా రచయితల సంఘం ముందుకు సాగుతోంది.
ఇప్పుడు ఉదృతంగా నడుస్తున్న కథా రచన వ్యాసంగం దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర నలుమూలల నుండి కథా ప్రవాహం వడిగా వేగంగా సాగుతున్న వైనాన్ని కథలు వ్రాస్తున్నవారు, వ్రాసినవారు, పాఠకులు కూడా కలిసి ఒక ప్రతినిధుల సమావేశంలో చర్చించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో రాష్ట్ర కథారచయితల సమావేశం జూన్ 9న, 2024 ఆదివారం తలపెట్టాం.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, కథల ఖజానాలకు అధిపతి వాసిరెడ్డి నవీన్, ప్రముఖ కథారచయితలు మహమ్మద్ ఖదీర్ బాబు, హైదరాబాద్, ప్రొఫెనర్ శిఖామణి, యానం, వేంపల్లి షరీఫ్, విజయవాడ, పెద్దింటి అశోక్ కుమార్, సిరిసిల్ల, చోరగుడి జాన్సన్, విజయవాడ, జి. వెంకటకృష్ణ, కర్నూలు, డా.ఆలూరి విజయలక్ష్మి, హైదరాబాద్, అట్టాడ అప్పల్నాయుడు, శ్రీకాకుళం మొదలైన రచయితలు హాజరై ప్రసంగిస్తారు.
ఈ సమావేశంలో ప్రసంగించే అతిధుల కథలతో పాటు, ప్రతినిధుల కథలలో ఎంపిక చేసిన ఒక 20 కథలను కూర్చి ఒక కథా సంపుటిని ప్రచురిస్తున్నాము. ప్రతినిధులు తమ కథలను ఇంతకు ముందు ఎక్కడా ప్రచురించనివి 10 పేజీలకు మించకుండా పంపాలి. ప్రచురించిన ఈ కథా సంకలనాలు 09.06.2024న ప్రతినిధులకు అందచేయడం జరుగుతుంది.
చర్చనీయ అంశాలు:
- కథ – చరిత్ర – గతి
- కథ జీవితం సమాజం
- కథ – ఉద్యమాలు
- కథ – కధనం – వస్తువు
- కథ – భాష – స్థానికత
కార్యక్రమం తేది: 09.06.2024 ఆదివారం
వేదిక: ఐడియల్ కళాశాల సెమినార్ హాలు, సామర్లకోట రోడ్, కాకినాడ
సూచిక:
- రిజిస్ట్రేషన్ : జి.వి.కె.వర్మ – ideal.varma@gamil.com
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: 22.05.2024 - రిజిస్ట్రేషన్ ఫీజ్:.200/- 9866145951 (ఫోన్ పే ద్వారా పంపాలి).
మీ కథ పంపవలసిన వివరాలు:
- కథ 10 పేజీలలోపు ఉండాలి. మే 22 నాటికి మాకు చేరాలి, 2. కథను పేజ్ మేకర్ అను 7.0, ప్రియాంక 16 ఫాంట్ పి.డి.ఎఫ్. మరియు ఓపెన్ ఫైల్ రెండూ పంపాలి.
- కథ పి.డి.ఎఫ్ ఫైలును 9848930203 WhatsApp, పి.డి.ఎఫ్. prabhuakkd@gmail.com కు పంపాలి.
- వివరాలకు: ఉప సంచాలకులు, మాకినీడి సూర్య భాస్కర్ (9491504045)
కార్యదర్శి, చింతపల్లి సుబ్బారావు (9866733293)