ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

సుపరిచిత సమకాలీన చిత్రకళాకారులు ఆకుల రఘు, అక్కిరాజు రమణ. ఈ జంట చిత్రకారులు తాము రూపొందించిన చిత్రకళాఖండాల ప్రదర్శనను హైదరాబాద్ లో అక్టోబరు 8 నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించారు. ‘ప్రకృతి రేఖలు (Strokes of Nature)’ శీర్షికతో ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా ప్రదర్శన కదరి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు, సుప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి సుప్రజారావు ప్రదర్శనను ప్రారంభించారు.

కవితావస్తువుగా అనర్హమైన అంశమేదీ సృష్టిలోనే లేదని మహాకవి శ్రీశ్రీ’ వక్కాణించారు. ఈ స్పష్టీకరణ వైవిధ్యవంతంగా విరాజిల్లుతున్న వివిధ కళారూపాలకూ, ప్రక్రియలక్కూడా వర్తిస్తుంది. కాగా దృశ్య ప్రధానమైన ఆకర్షణీయ మాధ్యమం చిత్రకళా రంగానికి మరింతగా అన్వయిస్తుంది. కళానైపుణ్యంతో చిత్రీకరించే తీరు, చిత్రవిచిత్ర చిత్తరువులకు వస్తువులుగా తాము తిరుగాడే పరిసర ప్రదేశాలలో, ప్రకృతి సౌంద్యం శోభిల్లుతున్న తావులలో తమకు తారసిల్లిన, తాము గమనించిన అరుదైన అద్భుత, అపురూప అంశాలను స్వీకరిస్తారు. ఎంపిక చేసుకున్న అంశంపరంగా విస్తృత విషయ సేకరణ నిమిత్తం ఇతోధిక పరిశీలన, పరిశోధన, అన్వేషణ చేస్తారు. వాటి ఆధారంగా ప్రభావోపేతంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా ఆ అంశాన్ని దృశ్యమానం చేయడానికి యథాశక్తి ప్రయత్నిస్తారు.

Artist Akkiraju Ramana

ప్రకృతికి పటం కట్టిన ‘అక్కిరాజు రమణ ‘: సందర్శకులను ఆకట్టుకొనే, ఆలోచింపజేసే వర్ణ, రేఖా చిత్రాలను రూపొందిస్తూ గణ్యతను గడించిన హైదరాబాద్ నగరానికి చెందిన సమకాలీన చిత్రకళాకారులలో అక్కిరాజు వెంకటరమణ సుపరిచితులు. రమణ తన క్యాన్వాసను, రంగులు కుంచెలను అసాధారణ రీతిలో అరుదైన పంథాలో, శైలిలో వినియోగించుకుంటూ కళాకృతులను చిత్రీకరించే బృహత్కార్యానికి అంకితమయ్యారు. సరికొత్త ఆలోచనలతో, నవీనరీతిలో తన ప్రత్యేకతను చాటుకుంటూ చిత్ర కళాఖండాలను సృష్టించే కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ప్రకృతిలో అంతర్భాగమైన అల్పజీవి, చూపరులకు కనువిందు చేస్తూ ఎగిరే కీటకమైన సీతాకోక చిలుకను రమణ తన చిత్రకళాఖండాల రూపకల్పనకు ఏకైక ప్రధాన అంశంగా నిర్దేశించుకున్నారు.

నేత్ర పర్వంగా ముచ్చట గొలిపే రంగురంగుల రెక్కలను రెపరెపలాడిస్తూ వనాలలో, పూతోటలలో, పచ్చిక బయళ్లలో వయ్యారంగా విహరిస్తూ సందడి చేసే సీతాకోకచిలుక జీవితం సందేశాత్మకమైనది, స్ఫూర్తిదాయకమైనదని రమణ ఉద్వేగంగా అంటారు. అసహ్యమైన ఆకృతిలో, చూస్తేనే శరీరం గగుర్పొడిచే గొంగడి పురుగు నుంచి ఆవిర్భవించిన సుందర, సుకుమార ప్రాణిగా సీతాకోకచిలుక అపూర్వ, అత్యద్భుత పరివర్తన ప్రక్రియకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలచిందని ఆయన పేర్కొన్నారు. లంపటంలో చిక్కుకున్న మనిషి ఆ సంకటం; దైన్యం నుంచి విముక్తి పొంది స్వేచ్చాయుత జీవన మార్గంలో ఆనందంగా సాగిపోతూ జీవితాన్ని ధన్యం, సార్థకం చేసుకొని తరించాలన్న మహత్తర సందేశాన్ని సీతాకోక చిలుక జన్మవృత్తాంతం ఇస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Stroke of Nature art show

ఈ సందేశ ప్రకటనే తన చిత్రకళాకృతుల ధ్యేయం, ప్రయోజనమని వివరించారు. రమణ హైదరాబాద్ నగరంలో జన్మించారు. కేశవ మెమోరియల్ హైస్కూల్, కాచిగూడా జూనియర్ కాలేజీలలో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థి దశలో డ్రాయింగ్ టీచర్, ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ నరేంద్రరాయ్ రమణలోని చిత్రతకళాభిరుచిని జాగృతం చేసి పుష్పించి ఫలింపజేశారు. రమణ తన ఆరవ ప్రాణంగా పరిగణించిన చిత్రకళాభిరుచితో దానిలో ప్రావీణ్యం సంతరించుకోవడానికి వివేకవర్ధనీ కళాశాలలో నిర్వహించిన చిత్రలేఖనం తరగతులలో చేరారు. అక్కడ బోధకుడు, చిత్ర కళా నిష్ణాతుడు శ్రీ డోంగ్రే శిష్క్రూషణలో మరిన్ని మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకున్నారు. గుల్బర్గాంలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం పొందారు. కళాపిపాస, జిజ్ఞాసతో ఆయన ఆశ్రయించిన విజ్ఞాన నిలయాలలో ప్రతిష్టాత్మక జె.ఎన్.టి.యు. ఫైన్ ఆర్ట్స్ కళాశాల తలమానికమైంది. దానిలో సుశిక్షణ పొంది బి.ఎఫ్.ఏ.పట్టా అందుకున్నారు. శిక్షణ కాలంలో చిత్రకళతో పాటుగా గ్రాఫిక్స్ డిజైన్స్, లేఅవుట్, పోస్టర్ రూపకల్పన తదితర సంబంధిత అనుబంధ అంశాలను కూడా శ్రద్ధాసక్తులతో, ఏకాగ్రతతో అభ్యసించి వాటిలో మంచి ప్రవేశం, పట్టుసాధించారు. ఆర్టిస్టుగా, డిజైనరుగా రాణించి ప్రశంసలు పొంది ప్రసిద్ధికెక్కారు.
రమణ సృజాత్మకత, వైవిధ్యం, నైపుణ్యం మేళవించిన చిత్రకారుడుగా, వ్యక్తిగతంగా, సహచిత్ర కళాకారులతో కలిసి సమష్టిగా నగరంలోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలతో పాటుగా రాష్ట్రతర నగరాలలోనూ ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని మెప్పుపొందారు. అవార్డులు, పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు.

తన వృత్తి వ్యాపకమైన డిజైనింగ్, డిస్ప్లే నిపుణతల విన్యాసాలకు సమాంతరంగా డ్రాయింగ్, స్కెచింగ్, కలరింగ్ వంటి చిత్ర కళారంగ పార్శ్వాలలో కూడా తన కృషినీ, సాధననూ సమర్థవంతంగా కొనసాగించి, అందినంత మేరకు అవకాశాలను పొంది సద్వినియోగపరచుకొని ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకొనే ధ్యేయంతో కళాప్రస్థానం సాగిస్తున్నారు.

రఘు ఆకుల చిత్రాలు – పచ్చదనం పరిమళాలు: రఘు చిత్రాల నేపథ్యం శరీరం పర్యావరణం పట్ల అతని మోహం మరియు ఉత్సాహాన్ని, మనుషులుగా మన ఉనికిపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తుంది. అతని సున్నితమైన సృష్టి పక్షులు, జంతువులు, పర్యావరణం మధ్య చమత్కారమైన సంబంధాల పట్ల మనల్ని విస్మయానికి గురిచేసింది. మనల్ని నిమగ్నం చేసే, అప్పుడప్పుడు కనిపించే రూపాన్ని, అలాగే అతని పెయింటింగ్స్‌లోని యానిమాను గమనించడం సాధ్యమవుతుంది. రఘు సహజ ప్రపంచం గురించి తన ఊహను సౌందర్య సూక్ష్మబేధంతో చిత్రీకరించడమే కాకుండా, వర్ణించబడిన దానికి మరియు వీక్షకుడు ఏమనుకుంటున్నారో మధ్య సంభాషణ జరిగేలా ఒక స్థలాన్ని కూడా రూపొందించాడు.

Artist Raghu Akula

రఘు చిత్రాలు సహజ సమతుల్యతను కాపాడటానికి సహాయపడే వన్యప్రాణుల పట్ల మన బాధ్యతలను పున:పరిశీలించుకుందాం. మానవ విముక్తి వైపు వేగంగా వెళ్తున్న సమాజంలో, మన గ్రహం మీద ఉన్న ఇతర జీవులకు మన బాధ్యతలను విస్మరించే వ్యయం మరింత స్పష్టంగా కనబడుతోంది. ఇది ప్రకృతి మరియు అది తీసుకువెళ్లే జీవితంతో మన పూర్వ స్థానాలను తిరిగి మూల్యాంకనం చేయడానికి పిలుపు.
రఘు కళ ప్రకృతి, పక్షులు మరియు జంతువుల పట్ల ఎంత మక్కువ కలిగి ఉందో స్పష్టంగా చూపిస్తుంది, వాటిలో కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. తన ఆలోచనలను తెలియజేయడానికి, అతను కాన్వాస్‌పై యాక్రిలిక్‌ల నుండి బొగ్గు వరకు పెన్ మరియు సిరా వరకు కాన్వాస్‌పై అనేక రకాల మాధ్యమాలను ఉపయోగిస్తాడు. అతని పనిలో రఘు పెయింటింగ్ టెక్నిక్స్ మరియు ప్రాసెస్‌లకు కమాండర్‌గా ఉన్న డిజైనర్‌గా ఇమైట్ వ్యూ. అతను సొగసైన సహజ నమూనాలు, ఆకుల వైవిధ్యం మరియు జంతువులపై అతివ్యాప్తి చెందుతున్న అద్భుతమైన రంగుల ఉపయోగం జంతు-ప్రకృతి పరస్పర ఆధారిత ఆలోచనను వ్యక్తపరుస్తుంది. బహుశా జంతువుల ఉపరితలంపై పట్టుకున్న పర్యావరణం యొక్క ప్రతిబింబమే రఘు సూచించే సంకట స్థితిపై మన దృష్టిని ఆకర్షిస్తుంది.

అడవులు కరవై, పచ్చదనం లుప్తమై పులులు, కోతులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు ఆవాసాల వైపు, పల్లెలు, పట్నాలలోకి వస్తున్నాయన్న తెలివి అందరిలో కలగాలన్నదే తన తపన అని ఆయన ఎంతో ఆర్తితో భావ స్ఫోరకంగా బొమ్మల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు.

ప్రకృతిపై, పశుపక్ష్యాదులపై పత్రహరితంపై, ప్రపంచ మనుగడపై ఇంతగా తపించే తనలో తాను మదనపడే ఆకుల రఘు హైదరాబాద్లోని ఘోషామహల్ ప్రాంతంలో 1966లో జన్మించారు. ఘోషామహల్ ప్రభుత్వ పాఠశాలలోనే పదవ తరగతి వరకు చదివారు. “తన చిన్న తనం నుండి బొమ్మలు వేసేవాడినని, అలా చిత్రరచన పట్ల ఆసక్తి పెరిగిందని రఘు చెప్పారు.” నాంపల్లి జూనియర్ కాలేజీ చదువు అయ్యాక, కొంతకాలం వి.వి.కాలేజీలో సాయంత్రంపూట “డోంగ్రే సర్’ చెప్పే చిత్రలేఖనం తరగతులకు హాజరై బేసిక్స్ తెలుసుకున్నారు, ఆ తరువాత 1988 సంవత్సరం జె.ఎన్.టి.యులో బి.ఎఫ్.ఏ. కోర్సు పూర్తిచేశారు.

కొంతకాలం బొంబాయిలో అడ్వర్టైజ్ మెంట్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్ లోనూ అదే ఉద్యోగం చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా పెయింటింగ్స్ వేస్తూ, పిల్లలకు డ్రాయింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు.


-కళాసాగర్ (9885289995)

Stroke of Nature

Artist Raghu Akula with his works
Stroke of Nature art exhibition

artist Raghu
stroke of nature art exhibition

1 thought on “ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap