ప్రతిపుట్టిన రోజు గడచిన కాలానికి ఓ గుర్తు మాత్రమే కాదు…
జీవితపు ప్రయాణంలో ఓ విరామ చిహ్నం … లాంటిది….
నేడు మహేష్ బాబు 45 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి.. బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రతీ అభిమానికి అవి కంఠోపాఠం. ఇండియాలో టాప్
మోస్ట్ కమర్షియల్ బ్రాండ్స్ కి మహేష్ బాబు..బ్రాండ్ అంబాసిడర్ గా ఫస్ట్ ఆప్షన్..బెస్ట్ ఆప్షన్ గా భావిస్తుంటారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తూ..మహేష్ బాబు రెండు చేతులా సంపాదిస్తున్నారని భావిస్తుంటారు. కాని కుడి చేతితో దానం చేసేది..ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇస్తుంటారని కొంతమందికి మాత్రమే తెలుసు. తన సంపాదనలో 30 శాతం ఛారిటీకి వినియోగిస్తుంటారు మహేష్ బాబు.
శ్రీమంతుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సైకిల్ తొక్కడం గుర్తుందిగా..ఆ సైకిల్ ని వేలం పాట వేసి వచ్చిన 10లక్షల రూపాయిలు.. హీల్ ఎ ఛైల్డ్ (Heal a Child) ఫౌండేషన్ కి విరాళంగా అందించారు మహేష్ బాబు. దాదాపు పదేళ్ళ నుంచి వ్యక్తిగతంగా కూడా ఎంతో
ఆర్థిక సహాయం చేశారాయన. ఇంతవరకూ 680 మంది పిల్లలకి వైద్య చికిత్సకి అవసరమైన మొత్తం చెల్లించింది. ఈ సంస్థ.
వీటిలో 9 ట్రాన్స్ ప్లాంటేషన్ కేసులు కూడా ఉన్నాయి. కిడ్నీ.. లివర్.. బోస్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్స్కి అవసరమైన సహాయం చేశారు.
మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం.. తెలంగాణాలో మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్ధపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.. సిద్ధపురం గ్రామంలో మహేష్ బాబు హీల్ ఎ ఛైల్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ నిర్వహింపజేశారు. 500 మంది పిల్లలతో పాటు పెద్దవారికి కూడా పరీక్షలు చేశారు. అందులో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పెద్దలని హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయించి ఆపరేషన్ చేయించారు మహేష్ బాబు..నమ్రతా దంపతులు. . సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఇది ఓ భాగం మాత్రమే.. వ్యక్తి గతంగా కూడా ఎందరో ఆరోగ్య సమస్యలకు.. చదువులకు సహాయం చేస్తుంటారు మహేష్ బాబు. అది శ్రీమంతుడు సినిమా కావచ్చు.. భరత్ అనే నేను సినిమా కావచ్చు. మహర్షి సినిమా కావచ్చు. ఆ సినిమాల్లో జనం కోసం చెప్పే కంటెంట్ ఏదయితే ఉందో..ఆ మంచితనం.. కష్టాల్లో ఉన్న తోటి వాళ్ళకు సహాయపడటం అనే గుణాలు.. ఆ కథలు.. క్యారెక్టర్లు చేయకముందే సూపర్ స్టార్ మహేష్ బాబులో ఉన్నాయి. అందుకే నిండు నూరేళ్ళు మహేష్ బాబు మరింత ఐశ్వర్యంతో.. ఆరోగ్యంతో..మానవతా గుణంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.