సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం-సెప్టెంబర్ 4 నుండి 6 తేదీ వరకు…
కె. ఎల్. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస ‘ సహకారంతో సురభి 2020 అనే గొప్ప అంతర్జాల ఉత్సవం సెప్టెంబర్ 4,5 మరియు 6 తేదీలలో నిర్వహింపబడుతుంది. దీనిలో 5 వ సంవత్సరం నుంచి 29 సం। వయస్సు వారందరూ పాల్గొనవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాలు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎందరో విద్యార్థులు, గొప్ప కళాకారులు, ఔత్సాహికులు ఈ యొక్క సురభి 2020 అంతర్జాల ఉత్సవం లో 35 కు పైగా పోటీల్లో పాల్గొనబోతున్నారు. మన భారతదేశ చరిత్ర లో సురభి 2020 మొట్టమొదటి విశ్వవిద్యాలయ అంతర్జాల ఉత్సవం గా నిలుస్తుంది. మన భారత దేశం నుండి మరియు ఇతర దేశాల నుండి సుమారు 20 వేల మంది పాల్గొనబోతున్నారు. వివిధ కళారూపాలు అనగా నృత్యాలు, నాటకాలు, సంగీతం, హస్త కళలు, చిత్రకళ, సాహిత్యం, వక్తృత్వం, మాక్ పార్లమెంట్, క్విజ్ లు, ఫ్యాషన్ షో మొదలగునవి సుమారు 30 పైగా కార్యక్రమాలని అంతర్జాలంలో నిర్వహిస్తున్నారు.
ప్రముఖమైన 700 మందికి పైగా న్యాయమూర్తులు ఈ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
ఇప్పుడున్న కోవిడ్-19 పాండమిక్ పరిస్థితుల వల్ల ఎందరో కళాకారులు తమ వృత్తికి దూరమయ్యారు మరియు తమ కళని ప్రదర్శించే అవకాశాలను కోల్పోయారు. ఈ పాండమిక్ పరిస్థితులకు ఎందరో కళాకారులు ప్రభావితమయ్యారు. వారి ఆర్థిక పరిస్థితి కుదేలై పోయింది. ఇటువంటి కళాకారులను ప్రోత్సహిస్తూ తమ కళలను విశ్వవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తూ స్ఫూర్తిదాయకంగా సురభి-2020 నిలుస్తుంది. సురభి స్పెషల్స్ పేరిట సలాం సురభి అనే కార్యక్రమం ద్వారా 400 సంవత్సరాల పేరున్న కథాకళి థియేటర్ వారికి అంతర్జాలంలో యూ ట్యూబ్ చానెల్ మరియు సోషల్ మీడియా ద్వారా కథాకళిని ప్రదర్శించే అవకాశం ఇస్తుంది. అలానే కర్ణాటక నుండి యక్షగానం, ఆంధ్రప్రదేశ్ నుండి తోలుబొమ్మలాట, శ్రీకాకుళం నుండి తప్పెటగుళ్ళు, తూర్పుగోదావరి జిల్లా లోని గరగలు, కృష్ణ జిల్లాలోని డప్పులు మొదలగునవి అంతర్జాలం లో చూపించబోతుంది.
సురభి సుగ్రామ పేరిట భారతదేశం లోని గ్రామీణ జానపదాలను నిర్వహిస్తున్నారు. భారతదేశం లో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన folks ని దేశంలోని విద్యార్థులందరికీ పరిచయం చేస్తున్నారు.
Idea Super Dancers, Dhee Dancers, ద్వారా ప్రత్యేక లైవ్ షో లు కూడా అలరించబోతున్నాయి. వివిధ కళారూపాల్లో వర్క్ షాపులు కూడా సురభి ద్వారా ఉచితంగా వివిధ కళలు నేర్చుకోవాలనే వారికి నేర్పించబడతాయి.
ఈ పోటీల్లో పాల్గొనేవారు సెప్టెంబర్ 02, 2020 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనటానికి ఈ క్రింది లింక్ లో రిజిస్టర్ అవ్వండి :- https://bit.ly/SURABHI20REG
Surabhi is a very good title…. wish you all the success…