లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

కడప జిల్లా సురభి అనే గ్రామంలో  1885లో పుట్టిన సురభి నాటక సమాజం,  గత 135 సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమయింది. మన ముత్తాత, తాత, తండ్రి, ఇప్పటి మన వరకు వినోదాన్ని, విషయాన్ని పంచుతున్న విశిష్టమైన సంస్థ. అప్పటికాలంలో వినోదం అంటే సురభినే. సురభి నాటకానికి వెళ్లడమంటే ఇంటిల్లిపాదికి ఒక పండుగ. మన పెద్దల బాధలకు ఓర్పు నిచ్చిన సంస్థ, దేవతల కథల పట్ల జ్ఞానం ఇచ్చిన సంస్థ, ఖాళీ సమయాల్లో వినోదాన్ని పంచిన సంస్థ ఇప్పుడు బ్రతకడానికి కష్టపడుతుంది.
మాములు సమయంలోనే వీరికి ఉపాధి కష్టంగా ఉండేది, ఇంకా లాక్ డౌన్ విధించేసరికి పరిస్థితి ఊహించలేనంతగా దిగజారిపోయింది. మేకప్, సెట్టింగ్స్, లైవ్ ఎఫెక్ట్స్, సంగీతం, సాహిత్యం, దర్శకత్వం, మాటలు, పాటలు ఒక్కటేమిటి ‘షో’ కు అవసరమయ్యే ప్రతి ఒక్క పనిని ఈ కుటుంబమే జాగ్రత్తగా చూసుకుంటుంది. వీరు ఒక్క షో ద్వారా వెయ్యి రూపాయలు పొందుతారు, నెలకు ఒక పది షోలు వేస్తే పదివేల రూపాయలతోనే పదుల సంఖ్యలో ఉన్న కుటుంబాన్ని నెట్టుక్కురావాల్సిన పరిస్థితి.


సాధారణ ప్రజలకు లాక్ డౌన్ మార్చి నుండి మొదలైతే వీరికి ఫిబ్రవరి నుండి మొదలయ్యింది. ఫిబ్రవరి నుండి నాటకాలు ప్రదర్శించే అనుమతులు లేక వేరొక పని పట్ల ఇష్టం, అవగాహన లేకపోవడం వల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక భవిష్యత్ లో లాక్ డౌన్ ఎత్తేసినా కానీ ప్రజలు ఇలాంటి నాటకాలకు, సినిమాలకు అంత త్వరగా రాకపోవచ్చు. సురభి మన దేశపు ఆస్థి. ప్రపంచంలో ఎక్కడలేని అపురూపమైన కళ మన పద్యనాటకం. ఇలాంటి కళను, ఈ కళాకారులను బ్రతికించేందుకు సహాయం చెయ్యగలరా? డబ్బు రూపంలో మాత్రమే కాదు నిత్యావసర సరుకులు, భోజన సదుపాయం రూపంలో కూడా మీరు అందించవచ్చు. వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
Surabhi Jayachandra Varma
Secretary, Sri Venkateswara Surabhi Theatre
Website: www.surabhitheatre.com
Email: surabhijayachandra@gmail.com
9912924723, 9494507007

1 thought on “లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

  1. 64 కళలు.కామ్ లోని ప్రతి వ్యాసం ఎంతో ప్రయోగాత్మకంగా ఉంటాయి. అరుదయిన విషయాలను నేటి తరానికి నూతన పరిచయాలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap