మన విశిష్ట సభ్యులు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్ చంద్ర గారు ఫిబ్రవరి 26వ తేదీ (శనివారం) హృదయాంజలి పేరుతో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వేదికమీద ప్రముఖ గాయనీ గాయకులతో సంగీతకార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మద్యాహ్నం 3.45 గంటలకు ఆరంభమయ్యే ఈ సంగీత కార్యక్రమం సాయంత్రం 7.00 గంటలకు ముగుస్తుంది. మల్లీశ్వరి, దేవదాసు, సువర్ణసుందరి, జయభేరి, మిస్సమ్మ, ఇలవేలుపు, మాయాబజార్, ఇల్లరికం, కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి, మంచికుటుంబం, నర్తనశాల, భైరవ ద్వీపం, బృందావనం, రుద్రవీణ, మీనా, జీవన తరంగాలు వంటి అద్భునత సినిమాలలోని పాటలు వినిపించి మన వీనులకు సంగీత విందు చేయనున్నారు. మన మిత్ర బృందమంతా ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా నాకు బాధ్యత అప్పగించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక అంశాలకు నేను సహకారం అందించాను. ఆహ్వానపత్రం పొందుపరుస్తున్నాను. తప్పక హాజరు కావలసిందిగా ఇదే మీకు ఆహ్వానం.
–ఆచారం షణ్ముఖాచారి
(అధ్యక్షుడు, సా.సం.స)