టివి సీరియల్ గా ‘యమలీల ‘

యమలీల సినిమా విడుదలయి ఇరవై ఆరేళ్ళు అవుతోంది. 1994 ఏప్రిల్ 28న యమలీల సినిమా విడుదలయింది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలన్ని టివిల ద్వారా.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ తరం వారికి కూడా చేరువయ్యాయి..అభిమాన పాత్రమయ్యాయి. ఇప్పుడు యమలీల సినిమాకి కొనసాగింపుగా ఓ టివి సీరియల్ రాబోతుంది. యమలీల తర్వాత అనే పేరుతో రాబోతున్న ఆ సీరియల్ ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ టివిలో త్వరలో ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా ఎస్.వి.కృష్ణారెడ్డితో ప్రత్యేకంగా సంభాషించింది 64కళలు.కాం
యమలీల తర్వాత అనే సీరియల్ చేస్తున్నారు. దాని వెనక కథా..కమామిషూ ఏమిటండి..?
ఈ టివి.. బాపినీడు గారు మాకెంతో ఆత్మీయులు. ఆ మాట కొస్తే మా కెరీర్ తొలి దశ నుంచి ఈనాడుకి చెందిన మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. నా సినిమాలకు అండగా ఉంది. మంచి అనుబంధం ఉంది. బాపినీడు గారు ఆ మధ్య పిలిచి.. ఈ టివి సంస్థ కోసం..ఏదన్నా విభిన్నమైన ఫాంటసీ సబ్జెక్ట్ చేయమని అడిగారు. యమలీల వచ్చిన పాతికేళ్ళ తర్వాత కథ ఏం జరుగుతుంది..మా టీమ్ తో కూర్చుని కథ తయారు చేశాం. కొమ్మనాపల్లి గణపతిరావుగారు కథనం సమకూర్చారు. ఐడియా అందరికి నచ్చింది. నా దర్శకత్వ పర్యవేక్షణలో సీరియల్ ప్రారంభమైంది.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన మీరు తొలిసారి ఓ టీవి సీరియల్ చేస్తున్నారు…ఎలా ఫీలవుతున్నారు.. ?
ఏ రంగంలో అయినా లేనని అన్పించుకోకూడదు.. ఉన్నామనే ముద్ర కనబడాలి. అందుకే విడాకుల సబ్జెక్ట్ మీద హాలీవుడ్ సినిమా చేశాను. హాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యుడిని అయ్యాను. అలాగే మనసు పెట్టి ఈ టివి సీరియల్ చేశాను. మొదటి టివి సీరియల్ కాబట్టి క్వాలిటీలో కానీ.. రిచ్ నెస్ లో కానీ ఎక్కడా తగ్గకూడదనుకున్నాం. నిర్మాత కొమ్మినేని సురేష్ గారు అలాగే ప్లాన్ చేశారు. నా దర్శకత్వ పర్యవేక్షణలో సురేష్ పాలకుర్తి అనే డైరెక్టర్ టివి సీరియల్ డైరెక్ట్ చేశారు. నా దగ్గర పని చేసిన బాలాజీ ఈ సీరియల్ కి క్రియేటివ్ హెడ్.. శేఖర్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. యమలీలో నటించిన ఆలీ.. మంజుభార్గవిగార్లు ఈ సీరియల్ లో నటించారు. యముడి పాత్రలో సుమన్ తొలిసారి నటిస్తున్నారు. నేనూ.. అలీ తొలిసారి చేస్తున్న టివి సీరియల్ యమలీల తర్వాత కావడం విశేషం. ఈ సీరియల్ ఇప్పటికి 26 ఎపిసోడ్స్ రెడీ చేశాం.. కొంతభాగం షూటింగ్ నాగర్ కర్నూల్ దగ్గర సోమశిల ప్రాంతంలో చేశాం. లాక్ డౌన్ ముందు కొంతభాగం చేశాం. మిగిలిన కొంత భాగం తగిన జాగ్రత్తలు తీసకుని ఈ కరోనా కాలంలోనే షూట్ చేశాం.

పాతికేళ్ళ తర్వాత అదే పాత్రలతో ప్రయాణం ఎలా ఉంది.. ?
చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంటిల్లిపాదికి తెలిసిన పేరు నాది. మళ్ళీ అందరితో టచ్ లో ఉన్నట్లు ఉంటుందని చేశాను. .

అసలు యమలీల సినిమా థాట్ ఎలా వచ్చింది.. ?
ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నాను. బెర్త్ మీద పడుకున్నప్పుడు రాజమండ్రి రాగానే పెద్ద కుదుపు వచ్చింది. ఆ కుదుపుకి పై నుంచి ఏదో పడ్డట్లు అన్పించి.. నిమిషంలో అంతా సర్దుకుంది. ఆ పై నుంచి పడింది చిత్రగుప్తుడి చిట్టా.. అయితే ఎలా ఉంటుందనే ఆలోచనే యమలీల సినిమాకి నాంది. మరి సినిమాల విషయానికొస్తే.. ? పెద్ద సినిమాలే చేస్తాను.. డిఫరెంట్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాను. కసితో చేస్తున్నాను. రంగంలోకి దిగితే అద్భుతాలే జరుగుతాయి అన్నారు. ఎస్.వి.కృష్ణారెడ్డి.

టివి సీరియల్ రంగంలోకి వచ్చారు…. వెబ్ సిరీస్ కూడా చేసే ఆలోచన ఉందా.. ?
సరైనది దొరికితే సరదాగా చేస్తాను…క్లీన్ ఎంటర్ టైనర్స్ మాత్రమే చేయాలనేది నా సిద్ధాంతంగా పెట్టుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా వెబ్ సిరీస్ చూశాను. మంచి టెంపోతో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. అలాంటి టెంపో ఉన్న థ్రిల్లర్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. నా కెరీర్ లో గన్ షాట్ లాంటి థ్రిల్లర్ సినిమా చేశాను. అప్పట్లో నాకున్న ఇమేజ్ కారణంగా ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. కాని ప్రకాష్ రాజ్ కి నంది అవార్డ్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap