కళా సైనికుడు గరికపాటి
(సెప్టెంబర్ 8 గరికపాటి రాజారావు వర్థంతి) కళ కళకోసం కాదనీ, కళ ప్రజలకోసమనీ, కళ మానవ జీవన గమనానికి వెలుగుబాటలు చూపించే ఒక ప్రగతిశీల సాధనమని చెప్పి… నాటకరంగం ద్వారా ప్రజాకళారంగానికి దిక్సూచిగా నిలచిన వైతాళికుడు డాక్టర్ గరికపాటి రాజారావు. తెలుగు నాటకరంగంలో అతి నవీన భావాలతో వినూత్న విలువలను ఆవిష్కరించి తెలుగు నాటక దశను, దిశను మార్చి…