‘గారపాటి’ కి తానా ‘గిడుగు స్మారక పురస్కారం 2019’
గిడుగు రామమూర్తి (1863-1940) పేరు చెప్పగానే 20వ శతాబ్ది ప్రథమ పాదంలో వ్యావహారిక భాషావాదానికి ఉద్యమరూపం కల్పించి గ్రాంధిక భాషావాదుల పై విజయం సాధించిన ఒక భాషాయోధునిగా ఆయన్ని అందరూ పరిగణిస్తారు. దీనికి మించి ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పాఠ్యగ్రంథ రచయిత. సవర భాషకు వ్యాకరణం రచించి, సవరల జీవితచరిత్రను…